Home లైఫ్ స్టైల్ నడకలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలి..!

నడకలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలి..!

ఎదుటి వారు మనతో ప్రవర్తించే విధానం మన బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది. నిలబడే తీరు, ముఖంలో ఒలికే కవళికలు మనల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.
పోశ్చర్: నడిచేటప్పుడు భుజాలు వెనక్కి, చుబుకం పైకి ఉండాలి. నిటారుగా ఉండాలి. శరీరం గురించిన కాన్షియస్ కలిగి ఉండాలి.
ముఖకవళికలు: ముఖం మీద చిరునవ్వు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలి. అప్పుడే ఇతరులు మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు. చిరునవ్వుతో మీ గురించి ఎదుటివాళ్లలో సద్భావనకలుగుతుంది.
స్వరం: అనవసరంగా గొంతు పెంచి మాట్లాడకూడదు. సందర్భాన్నిబట్టి స్వరం మారుస్తూ ఉండాలి. మార్దవం, గంభీరం, సున్నితత్వం స్వరంలో సందర్భానుసారంగా తొణికిసలాడాలి.
చేతుల కదలికలు: అవసరాన్నిబట్టి భావ వ్యక్తీకరణకు తోడ్పడేలా చేతులు కదిలించాలి. మీరు వ్యక్తం చేయదలచుకున్న విషయాన్ని చేతుల కదలికలు స్పష్టం చేసేలా ఉండాలి.
కళ్లు: పరిచయం చేసుకునేటప్పుడు సూటిగా కళ్లలోకి చూడాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడూ కళ్లలోకి చూస్తూ వినాలి.
నడక: ఎంత హడావుడిలో ఉన్నా ఆ తొందర నడకలో ప్రతిబింబించకూడదు. నడకలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలి.

Behavior is based on body language