Home హైదరాబాద్ ధైర్యంగా 100 కు డయల్ చేసిన మహిళ…

ధైర్యంగా 100 కు డయల్ చేసిన మహిళ…

Behavior of auto drivers towards late night woman
బాచుపల్లి : అర్థరాత్రి సాప్ట్‌వేర్ మహిళపై ఆటోవాలాలు అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పుణెకు చెందిన సోనాలి అనే మహిళ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతుంది. అయితే దాదాపు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా ఓ రెస్టారెంట్ వద్ద తన కారును అపింది. అక్కడే ఉన్న ఒక ఆటో రివర్స్ తీసుకుంటుండగా ఆమె కారును ఢీ కొట్టింది. దీంతో ఆమె ప్రశ్నించడంతో ఆటో డ్రైవర్లు అయిన శివ, లక్ష్మణ్‌లు సోనాలిపై దాడికి ప్రయత్నించి అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో భాధితురాలు 100కు డయల్ చేసింది. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు ఘటన స్థలానికి చేరుకొని ఘటనకు కారణమైన శివ, లక్ష్మణ్‌లను వారి ఆటోలతో పాటు బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తనపై దాడి చేయడానికి  ప్రయత్నించిన నింధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. భాధితురాలు 100కు ఫోన్ చేయడంతో కంట్రోల్ రూం నుంచి సమాచారం అందుకున్న స్థానిక బాచుపల్లి పోలీస్‌స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారని, కానీ వారు కూడ తనను అసభ్యకరంగా చూశారని, ఆటో వాలాల తోటి మిలాఖత్ అయి పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఈ విషయపై సిఐ బాలకృష్ణరెడ్డిని వివరణ కోరగా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.