Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

తొలి టెస్ట్ లో భారత్ ఓటమి..

Ben Stokes bowls England to victory

బర్మింగ్‌హామ్‌: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో ఇంగ్లాడ్ జట్టు చరిత్ర  సృష్టించింది. ఎడ్జ్‌ బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టిమిండియా 31 పరుగుల తేడాతో  ఓటమి పాలైంది. 194 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 162 పరుగులకే ఆలౌటైంది. ఆఖరి వరకు గెలుపు కోసం పోరాడిన భారత్‌ కు నిరాశే ఎదురైంది. ఇంగ్లిష్‌ ఓపెనర్‌ బెన్‌స్టోక్స్‌ నాలుగు వికెట్లతో టిమిండియా పతనం శాసించాడు. విరాట్‌ కొహ్లి (51; 93 బంతుల్లో 4×4), హార్దిక్‌ పాండ్య (31; 61 బంతుల్లో 4×4) మినహా మరెవ్వరూ రాణించలేదు. బంతితో, బ్యాట్‌తో రాణించిన యువ బౌలర్ సామ్ కర్రన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

Comments

comments