Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

పండు, పండు.. పండు గుమ్మడి పండు!

Pumpkin-Fruit

కుకుర్బిటా కుటుంబానికి చెందిన గుమ్మడి పోషక విలువలతో కూడి ఉన్నది. అమెరికాలోని అలస్కా, అంటార్కిటికాలో తప్ప మిగిలిన ఆరు ఖండాల్లో గుమ్మడి పండుతుంది. విదేశాల్లో హాలోవీన్ సందర్భంగా పంప్‌కిన్ కార్వింగ్ తప్పకుండా చేస్తారు. బొద్దుగా ఉండే పిల్లల్ని చూస్తే గుమ్మడి పండులా ఉన్నారని అనడం మన దగ్గర సాధారణం. ముద్దొచ్చే గుమ్మడిని గూర్చిన కమ్మని కబుర్లు…

గ్రీకులు గుమ్మడికాయను పెపాన్ అని పిలిచేవారు. ‘అతి పెద్ద మెలన్’ అని దీని అర్థం.
* ఇవి రకరకాల సైజుల్లో, ఆకారాల్లో లభిస్తాయి.
* గుమ్మడి గింజలను ఏప్రిల్‌లో గ్రీన్ హౌసుల్లో నాటుతారు. ఇవి మే వచ్చేసరికి కొద్దిగా ఎదుగుతాయి, ఆ సమయంలో వాటిని బయట ఉంచుతారు. ఆకుపచ్చ రంగునుంచి నారింజ రంగుకు మారే సమయంలో వీటిని కోయవచ్చు.
* అక్టోబర్ 2012 లో 2009 పౌండ్ల బరువుతో కాసిన గుమ్మడికాయ ఇప్పటి వరకు అతిపెద్దదిగా రికార్డుల్లోకెక్కింది.
* పంప్‌కిన్ పై అనే వంటకాన్ని థాంక్స్ గివింగ్ డే రోజున చేయడం అమెరికన్ల ఆనవాయితీ. పాస్తా, లసగ్నే వంటి వంటల్లో గుమ్మడిని వాడతారు అమెరికన్లు.
* అమెరికాలో ఏటా 1.5 బిలియన్ పౌండ్ల గుమ్మడికాయలు ఉత్పత్తి అవుతాయి.
* ప్రపంచవ్యాప్తంగా 45 రకాల గుమ్మడికాయలున్నాయి.
* గుమ్మడికాయల్లో 90% నీరు ఉంటుంది, ఒక కప్పు గుమ్మడి ముక్కల్లో 83 క్యాలరీలు, అర గ్రాము కొవ్వు ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. అరటిపండ్లలో కంటే ఎక్కువ పొటాషియం గుమ్మడికాయల్లో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి.
* గుమ్మడిపూలు కూడా తినవచ్చు. భారతీయులు పులుసుల్లో, సాంబార్లో వీటిని వాడతారు. బెల్లం వేసి కూరగా వండుకుంటారు. గుమ్మడి గింజలు ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి.

Comments

comments