Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

నువ్వుల నూనెతో మర్దనా చేసుకుంటే…

Benefits of Sesame Oil And Its Side Effects
దీపావళి రోజున ఉదయాన్నే స్నానం ఆచరించి, కొత్తబట్టలు వేసుకుని పండుగ సంబరాలను జరుపుకుంటారు. నరకచతుర్దశి రోజున అభ్యంగన స్నానం చేయడం అనేది ఆరోగ్యపరంగా కూడా మంచిదేనని చెప్తున్నారు మన పెద్దలు. ఒంటినిండా నూనె పట్టించి, దానిని శెనగపిండితో రుద్దుకుని.. పావు గంట అలానే వుండి.. తలంటు స్నానం చేయాలి. దీపావళి నాటి నుంచి ఇక చలికాలం మొదలైపోతుంది. ఒంట్లోని రక్తప్రసరణ వ్యవస్థ సరిగా లేకుంటే, వచ్చే చలికాలంలో ఇబ్బందులు తప్పవు. అందుకే శరీరభాగాలు మొద్దుబారిపోకుండా వుండేందుకు.. నూనెను పట్టించి.. అభ్యంగన స్నానం చేస్తారు.
దీపావళి అభ్యంగనం స్నానం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా దీపావళి రోజున నువ్వులనూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని పెద్దలు చెప్తున్నారు. నువ్వులనూనెలో వేడి పుట్టించే గుణం ఉంటుంది. ఇక శెనగపిండికి చర్మానికి ఉండే స్వేదరంధ్రాలను శుభ్రపరిచే స్వభావం ఉంది. అందుకే దీపావళి రోజున నూనెతో శరీరానికి మర్దన చేసి అభ్యంగన స్నానం చేయాలి. అలాగే నరకచతుర్దశి నాటి నుంచే, ఇళ్లల్లో, ఆలయాల్లో నువ్వులనూనెతో చేసిన దీపాలను ఎక్కువగా పెడతారు. దీపం నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Benefits of Sesame Oil And Its Side Effects

Telangana News

Comments

comments