Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కొండచిలువతో సెల్పీ: తృటిలో తప్పిన ప్రమాదం

Selfi-12

కలకత్తా:  పశ్చిమ్‌బంగాలోని జల్పైగురి అనే గ్రామంలోకి వచ్చిన కొండచిలువ మేకను చంపి తినేందుకు ప్రయత్నిస్తుంటే  గ్రామస్థులు చూచి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తన బృందంతో కలిసి అక్కడికి చేరుకున్న సంజయ్ దత్ అనే అటవీ శాఖ అధికారి దాన్ని పట్టుకున్నాడు. కొండచిలువను పట్టుకొని అడవిలో వదిలేయకుండా సెల్ఫీ దిగుదామని సంజయ్ సంబర పడ్డారు. ఒక చేత్తో పామును పట్టుకొని, మరో చేత్తో సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఇంతలో ఆ పాము సంజయ్ మెడను చుట్టేసింది. ఈ విషయం గమనించిన మరో వ్యక్తి దాని తోకను గట్టిగా పట్టుకొని మెడను చుట్టేయకుండా అడ్డుకోగలిగాడు. లేదంటే క్షణాల్లో అతడి ప్రాణం పోయేది. ఈ ఘటన అనంతరం  సంజయ్  కొండచిలువను సమీప అటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Comments

comments