Home సినిమా ‘బెంగాల్ టైగర్’ గీతాల ఆవిష్కరణ

‘బెంగాల్ టైగర్’ గీతాల ఆవిష్కరణ

bengal-tigerరవితేజ హీరోగా తమన్నా, రాశీఖన్నాలు హీరోహీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వం వహి స్తున్న చిత్రం ‘బెంగాల్ టైగర్’. కెకె రాధామోహన్ నిర్మాత. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొమన్ ఇరాని బిగ్ సిడిని విడుదల చేయగా నిర్మాత రాధామోహన్ ఆడియో సిడిలను విడుదల చేశారు. తమన్నా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొమన్ ఇరానీ మాట్లాడుతూ ‘సినిమాలో కేవలం 10 నుంచి 15 నిమిషాలు కనిపించే నా పాత్ర కోసం దర్శకుడు సంపత్ చాలా శ్రద్ధ తీసుకున్నాడు. రవితేజ చాలా ఎనర్జిటిక్ హీరో. తమన్నా సినిమా కోసం హార్డ్ వర్క్ చేస్తుంది. రాశి సినిమాలో చాలా అందంగా ఉంటుంది’అని చెప్పారు. రవితేజ మాట్లాడుతూ ‘తమన్నా, రాశీఖన్నాలతో కలిసి స్క్రీన్‌షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. తమ న్నా తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. సంపత్ ఖచ్చితంగా ‘బెంగాల్ టైగర్’లో హ్యాట్రి క్ కొడతాడు. బీమ్స్‌లో మంచి టాలెంట్ ఉంది. తన ట్యూన్స్, మ్యూజిక్ సెన్స్ సూపర్బ్‌”అని తెలిపారు. సంపత్‌నంది మాట్లాడుతూ ‘రవితేజ ఎనర్జీ గురించి మాట్లాడడానికి నా ఎనర్జీ సరి పోదు. సింగిల్ సిట్టింగ్‌లో కథ విని ఓకే చేశారు. బీమ్స్ వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. సౌందర్ రాజన్ ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది’అని చెప్పారు. తమన్నా మాట్లాడుతూ ‘బీమ్స్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఐదు పవర్‌ఫుల్ సాంగ్స్ ఇచ్చాడు. ‘రచ్చ’లాంటి సూపర్‌హిట్ సినిమా ఇచ్చిన సంపత్‌నందితో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. రాశి చాలా సహజంగా నటి స్తుంది’అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాధామోహన్, బీమ్స్, రాశీఖన్నా, రామజోగ య్యశాస్త్రి, రామ్‌లక్ష్మణ్, హంసానందిని, అక్ష, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.