Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

థీమ్ సాంగ్‌లో ‘బెంగాల్ టైగర్’

_Bengal-Tigerరవితేజ హీరోగా తమన్నా, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘బెంగాల్ టైగర్’. శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌లో కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా థీమ్‌సాంగ్‌ని హైద రాబాద్ పరిసరప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటను 120 మంది డ్యాన్సర్స్‌తో రవితేజపై ఈ చిత్రంలోని ఇంట్రడక్షన్ సాంగ్‌గా చిత్రీక రిస్తున్నారు. ఈ పాటలో ఐటమ్‌గర్ల్ హంసా నందిని రవితేజతో స్టెప్పులు వేస్తోంది. నిర్మాత కెకె రాధామోహన్ మాట్లాడుతూ “సినిమా షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం సినిమా థీమ్‌సాంగ్‌ని 120మంది డ్యాన్సర్స్, రవితేజతో కలిసి ఇంట్రడక్షన్ సాంగ్‌గా చిత్రీకరిస్తున్నాం. ఈ గీతాన్ని ప్రముఖ కన్నడ కొరియోగ్రాఫర్ హర్ష ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ సాంగ్‌లో హంసానందిని, రవితేజతో స్టెప్స్ వేస్తోంది. ఈ పాట సినిమాకే హైలైట్ అయ్యేవిధంగా దర్శ కుడు సంపత్‌నంది ప్లాన్ చేశారు. సినిమాలో అతిథి పాత్రల్లో హర్షవర్దన్‌రానే, అక్ష నటిస్తున్నారు. బోమన్ ఇరానితో పాటు రావుర మేష షియాజీ షిడే, నాజర్, పోసాని కృష్ణము రళి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు” అని అన్నారు.

దర్శకుడు సంపత్‌నంది మాట్లా డుతూ “బెంగాల్ టైగర్ చిత్రం షూటింగ్ అను కున్న విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతోంది. సినిమాలో వచ్చే ప్రతి యాక్షన్ పార్ట్‌ను థియేటర్స్‌లో విజిల్స్ పడేలా చిత్రీకరిం చాం. అలాగే సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అవుతు ంది. రవితేజ, బ్రహ్మానందం కాంబినేషన్‌లో సీన్స్ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తూ ఎంటర్‌టైన్ చేస్తాయి”అని చెప్పారు.

Comments

comments