Search
Sunday 18 November 2018
  • :
  • :

ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ బెంగాలీ నటి

Bitasta-Saha

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటి బిటస్త షా తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో గల ఆమె ప్లాటులో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత రెండు రోజులుగా ఆమె తల్లి ఎన్ని సార్లు ఫోన్ చేసిన బిటస్త నుంచి సమాధానం రాలేదు. దాంతో అనుమానం వచ్చిన ఆమె బిటస్త ప్లాటుకు వచ్చి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. చాలా సేపు తలపులు కొట్టినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అక్కడికి చేరుకున్న పోలీసులు తలపులు బద్ధలు కొట్టి చూడగా బిటస్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఉరి వేసుకుని అప్పటికే రెండు రోజులు అయినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో బిటస్త మణికట్టుతో పాటు ఇతర శరీర భాగాలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Comments

comments