Search
Monday 24 September 2018
  • :
  • :

ఐయామ్ రియల్లీ సారీ…

Virat-Kohli

బెంగళూరు: ఐపిఎల్ 10వ సీజన్‌లో పేలవమైన ఆటతో ఇప్పటికే ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథి విరాట్ కోహ్లీ తమ అభిమానులకు సారీ చెప్పారు. అలాగే తమపై ఇంతా అభిమానం, ప్రేమ చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మా ఆటతీరుతో ఈసారి మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసినందుకు క్షమించండి అంటూ కోహ్లీ క్షమాపణ కోరారు.

మాపై ఎంతో ప్రేమ చూపించి వెన్నంటే ఉన్నా అభిమానులకు చాలా చాలా ధన్యవాదాలు. మేము మా స్థాయికి తగినట్టు ప్రదర్శన చేయలేకపోయినందుకు సారీ చెబుతున్నానని విరాట్ ట్వీట్ చేశాడు. ఈ సీజన్‌లో బెంగళూరు 12 మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం 5 పాయింట్లతో ఆర్‌సిబి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నా విషయం తెలిసిందే.

Comments

comments