Home జాతీయ వార్తలు బెంగళూరు విద్యార్థికి భారీ వేతనం

బెంగళూరు విద్యార్థికి భారీ వేతనం

Bengaluru student bags a Rs 1.2cr annual package at Google

బెంగళూరు: గూగుల్‌ నిర్వహించిన ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెస్టులో కర్నాటక రాజధాని బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటిబి)కి చెందిన 22 ఏళ్ల విద్యార్థి ఆదిత్య పలివల్‌ ఎంపికయ్యాడు. దీంతో ఆయన ఏడాదికి సుమారు 1.2 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకోనున్నాడు. ముంబయికి చెందిన ఆదిత్య ప్రస్తుతం ఐఐఐటి-బెంగళూరులో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చేస్తున్నాడు. గూగుల్‌ నిర్వహించిన ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెస్టులో ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, 50 మంది మాత్రమే ఎంపిక య్యారు. వీరిలో ఆదిత్య పలివల్‌ కూడా ఒకరు.