Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బన్నీ కెరీర్‌లోనే బెస్ట్ ‘సరైనోడు’

sarainoduఅల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘సరైనోడు’ చిత్రం ఇటీవల విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఈ చిత్రం సక్సెస్ సంబరాల్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “మంచి కోసం మాత్రమే మనం ఉండాలి అనే ‘సరైనోడు’ పాత్ర బన్నీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. బోయపాటి దర్శకత్వం, బన్నీ పర్‌ఫార్మెన్స్, ఆది పినిశెట్టి నటన, హీరోయిన్స్ గ్లామర్, తమన్ మ్యూక్ చిత్ర విజయంలో ప్రముఖ పాత్ర పోషించాయి”అని అన్నారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ “అల్లు అరవింద్, బన్నీ నా మీద నమ్మకం పెట్టి చేసిన చిత్రం ‘సరైనోడు’. అనుకున్నట్టుగానే ఈ సినిమా ఘన విజయం సాధించడం ఆనందంగా ఉంది”అని తెలిపారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ “సరైనోడు చిత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నా కెరీర్‌లో బెస్ట్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు బోయపాటి శ్రీను నాకు ఊరమాస్ అనే టైటిల్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, రకుల్‌ప్రీత్ సింగ్, కేథరిన్, ఆది పినిశెట్టి, సమీర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments