Search
Saturday 22 September 2018
  • :
  • :

కెరీర్‌లో ఓ మైలురాయి

amy-jacksonభారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మక చిత్రం ‘2.0’లో నటిస్తున్నందుకు అమీజాక్సన్ ఎంతో సంతోషంగా ఉంది. సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ‘రోబో’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమీ హీరోయిన్‌గా నటిస్తోంది. లెజెండర్ యాక్టర్ రజనీతో కలిసి నటి స్తున్న ఈ చిత్రాన్ని తన కెరీర్‌లో ఓ మైలురాయిగా పేర్కొంది ఈ హాట్‌బ్యూటీ. అదేవిధంగా స్టార్ డైరెక్టర్ శంక ర్‌తో కలిసి రెండవ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండడం తన అదృష్టంగా భావిస్తున్నానంటోంది ఈ అమ్మడు. ఇప్పటికే అమీ… శంకర్ దర్శకత్వంలో ‘ఐ’ సినిమా చేసింది. ఇక సినిమాలో విలన్‌గా చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీ రో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు అమీ జాక్సన్ చెప్పింది. వీరిద్దరి మధ్య సన్నివేశాల చిత్రీకరణ ఇంకా జరగాల్సి ఉంది. అక్షయ్ గురించి అమీ మాట్లాడుతూ “బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరో అక్షయ్‌కుమార్. హిందీలో కూడా రిలీజయ్యే ఈ చిత్రానికి అక్షయ్ మూలంగా బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. సౌత్ భాషలతో పాటు హిందీలో ఈ చిత్రం విడుదలకానుండడం నాకు ఎంతో ప్లస్‌గా మారిం ది”అని చెప్పింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే పెద్ద షెడ్యూల్‌లో అక్షయ్, అమీ జాక్సన్‌ల మధ్య సన్నివేశాల ను చిత్రీకరించబోతున్నాడు దర్శకుడు శంకర్. సినిమాలో ఈ సీన్‌లన్నీ ఎంతో రసవత్తరంగా ఉంటాయని అంటు న్నారు ఫిల్మ్‌మేకర్స్.

Comments

comments