Home తాజా వార్తలు ఇండియాలోనే తొలి సారిగా..

ఇండియాలోనే తొలి సారిగా..

Prabhas Sahoo ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ విజువల్ ఎఫెక్స్‌తో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోందట. అంతేకాకుండా ఇంతవరకు ఇండియాలో ఏ సినిమాలో కూడా ఇన్ని విజువల్ ఎఫెక్ట్ సీన్లు లేవని చెబుతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు సుజిత్ హాలీవుడ్ రేంజ్‌లో తీర్చిదిద్దుతున్నాడు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా విడుదల కానుంది. ఇక ప్రభాస్ ఈ చిత్రంతో పాటు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ చిత్రంలో నటిస్తున్నారు. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Best Visual Effect Scenes in Prabhas Sahoo movie