Home తాజా వార్తలు కార్తికేయ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటి వైద్యానికి నాంది

కార్తికేయ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటి వైద్యానికి నాంది

Karthikeya Hospitals Doctors

 

భద్రాద్రి కొత్తగూడెం: ఏజెన్సీ ఏరియాలోని అశ్వారావుపేటలో మొట్ట మొదటి సూపర్ స్పెషాలిటి వైద్యానికి నాంది ప్రస్థావన గావించిన కార్తికేయ హాస్పిటల్ వారు అందిస్తున్న వైద్య సేవలు రోగుల పాలిట ‘సంజీవిని’గా నిలుస్తుంది. ఈ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న వైద్య నిపుణుల సేవలు వారి మాటల్లోనే.. డాక్టర్ రవికిరణ్(ఎంబిబిఎస్, ఎండి), సిఎంసి వెల్లూర్ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తూ వారికి సేవలందించడం ఎంతో సంతోషంగా ఉంటుందని, తమ దగ్గరకు వచ్చిన రోగుల సమస్యలు తెలుసుకొని సరైన వైద్యం మరియు మందులతో వారిని ఆరోగ్యవంతులుగా చేయడంలో మంచి నిష్ణాతులుగా పేరుగావించారు.

రిపోర్టర్‌: మీరు రోగులకు ఎటువంటి సమస్యలకు వైద్యం అందించగలరు?

డాక్టర్‌: సీజనల్‌గా వచ్చే వ్యాధులు కంటే వర్షాకాలంలో అయితే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్స్‌కి వైద్య సేవలు అందిస్తామని అలాగే వేసవిలో వచ్చే సమస్యలు డీహైడ్రేషన్ సమస్యకు, ముఖ్యంగా ఎండాకాలంలో మద్యాహ్న సమయంలో బయట తిరగడాన్ని తగ్గించుకోవాలని, లేదా ఎండ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎండ ప్రభావం వలన తలనొప్పిగా, నీరసంగా ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని తెలిపారు. అదే విధంగా గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, బిపి, షూగర్, పక్షవాతం, పాయిజన్ మరియు పాముకాటు లాంటి సమస్యలకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు.

డాక్టర్ ఎం హారిక, ఎమ్‌ఎస్ ఓబిజి(స్త్రీల వైద్య నిపుణురాలు)
డాక్టర్ హారిక గైనకాలజిస్ట్‌గా గోల్డ్‌మెడల్ యూనివర్శిటీ సాధించారు. స్త్రీల వ్యాధుల పట్ల మెరుగైన అనుభవం వీరిసొంతం. ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గర్భసంచిని తొలగింప చేసే శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. దీనివల్ల త్వరగా మోనోఫాజ్ బారిన పడతారని, అంతేగాక అనేక సమస్యలు వారి చుట్టుముడతాయని, గర్భసంచి ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని అంటున్నారు. అలానే సంతానం కలగని దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వడం వీరి ప్రత్యేకత. కౌన్సిలింగ్ తదుపరి మందుల ద్వారా గర్భం ధరించే ప్రక్రియలు తెలియజేస్తూ.. సహజ ప్రసవాలకు వీరు పెద్దపీట వేస్తున్నారు. ఈ రోజుల్లో కొందరు కావాలని సిజేరియన్ చేయమని అంటున్నారని దానివల్ల కోతలు, కుట్లు సమస్యలు, చర్మం అతుకులు పడతాయని అది సరైన పద్దతి కాదని దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని సహజ ప్రసవాలు మేలని తేల్పారు. ఇలా మన అశ్వారావుపేటలో కార్తికేయ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉంచారు.

Better medicine in Karthikeya Hospitals at Aswaraopet