Home వార్తలు మంచి మార్గమే ఎంచుకున్నా

మంచి మార్గమే ఎంచుకున్నా

kanganaఎంత డబ్బుంటే ఏం లాభం… ఆ డబ్బుతో సంతోషాన్ని కొనగలమా… అంటూ ఆధ్మాత్మిక ధోరణిలో మాట్లాడేస్తుంటారు కొందరు సెలబ్రిటీలు. ఇందులో చాలా మంది మాటలు అదోరకంగా ఉంటాయి. అయితే మనసులో ఏదున్నా మొహం మీద కొట్టినట్లు మాట్లాడే బాలీవుడ్ హాట్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు. డబ్బుతో సంతోషాన్ని కొనలేం వంటి మాటల్ని తాను నమ్మనని ఆమె చెప్పింది. “నేనైతే డబ్బుతో దేన్నయినా కొంటాను. అది సంతోషమైనా సరే. శాశ్వత సంతోషం కాకపోయినా… తాత్కాలికంగానైనా డబ్బు వల్ల ఆనందం పొందవచ్చని నా ఉద్దేశం. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే నా మాటను ఎవ్వరైనా ఒప్పుకుంటారు”అని కంగన చెప్పింది. “17 ఏళ్లకే నేను చాలా డబ్బు కళ్ల చూడడం మొదలుపెట్టాను. ఆ వయసులో ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు డ్రగ్స్, ఇతర చెడు అలవాట్లకు బానిసలవుతారు. కానీ నేను అలా చేయలేదు. మంచి మార్గమే ఎంచుకున్నాను. నాకంటూ ఓ ఇల్లు కొనుక్కునున్నాను. భూమిపై పెట్టుబడి పెట్టడానికే నా తొలి ప్రాధాన్యం. ఆతర్వాత జ్యూయల్లరీ అంటే ఇష్టం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు”అని తెలిపింది ఈ బ్యూటీ. ఇక ఇంతకుముందు ఐటమ్ సాంగ్స్ చేయొద్దని.. ఎంతో డబ్బిచ్చినా పార్టీల్లో డ్యాన్సులు చేయవద్దని అనుకునేదాన్నని ఆమె చెప్పింది.