Home తాజా వార్తలు ఆటేదైనా బెట్టింగ్ కట్టాల్సిందే..!

ఆటేదైనా బెట్టింగ్ కట్టాల్సిందే..!

Betting fever touched on rural areas
కొత్తగూడెం కలెక్టరేట్: బెట్టింగ్ పెట్టాలనుకుంటే చాలు ఆటేదైన బెట్టింగ్ పెట్టేస్తాం అంటుంది యువత. ఒక్కప్పుడు బెట్టింగ్‌కి చిరునామ మహానగరాలు ఉండేవి. క్రమక్రమేన అది పట్టణాలకు తాకిన అతి కొద్ది కాలంలోనే గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించింది అనడంలో సందేహం లేదు. బెట్టింగ్‌లో లక్కు బాంగుంటే బేబులు నిండుగా ఉంటాయి. అదే విఫలమైతే ఇంకా అంతే సంగతులు, జేబుకు పడ్డ చిల్లుతో తెల్లమోహం వేసుకొని చూడాలి. దేశంలో లీగల్ బెట్టింగ్‌లు కొన్ని ఉన్నప్పటికి, ఇల్లీగల్ బెట్టింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్) ఇల్లీగల్ బెట్టింగ్ జోరును పెంచింది. దేశంలో క్రికెట్ ఆటకు మంచి ఆదారణ ఉండడంతో ఐపిఎల్ మ్యాచ్‌ల సమయంలో ఏ టీమ్ గెలుస్తుందో అని దగ్గరుండి బాల్ టూ బాల్ వరకు బెట్టింగ్‌లు పెట్టడం ప్రారంభించారు. ఇది ముందుగా మహానగరాల్లో ఉండేది కాని ఇప్పుడు ఏకంగా పల్లేలకు సైతం పాకింది. ప్రతి ఏడాది ఐపిఎల్ వచ్చిందంటే బెట్టింగ్ రాయుళ్లకు పండుగ వచ్చినట్టే. బెట్టింగ్‌లు పెట్టేటప్పటికి పట్టణాల్లో కోట్లు చేతులు మారుతుంటే.. తాము ఏమి తీసిపోమని పల్లేల్లో కూడా లక్షల్లో బెట్టింగ్‌లు పెడుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరల్డ్ కప్ మొదలైన నాటి నుండి నేటి వరకు ఆ మ్యాచ్‌లకు సంబంధించి కూడా జోరుగా బెట్టింగ్ సాగుతుంది. ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లను సైతం వదలడంలేదు. అధిక శాతం యువకులే ఈ బెట్టింగ్‌కు బానిసలుగా మారి డబ్బును దుబార చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా బెట్టింగ్‌లకు పాల్పడుతూ.. ఏరికోరి ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. సమాజాన్ని బెట్టింగ్ మహమ్మారి పట్టి పీడిస్తుంటే.. నియంత్రిచాల్సిన పోలీస్ శాఖ పట్టనుట్టుంది. కొందరు బెట్టింగ్ రాయుళ్లు తమ బెట్టింగ్ వ్యాపారం సాఫిగా సాగేందుకు పోలీస్ శాఖలోని కొంత మంది అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లన పలు అనుమానాలకు తావునిస్తుంది.

ఆటలెన్నో.. బెట్టింగ్ ఒక్కటే…
బెట్టింగ్ అంటే కేవలం ఐపిఎల్‌లోనే కాదు ఇప్పుడు ఆ జబ్బు అన్ని ఆటలకు సోకింది. బెట్టింగ్ నిర్వహించే ముఠా యువకులకు గాలం వేసి క్రికెట్ బెట్టింగ్‌తో పాటు ప్రతి ఆటకు బెట్టింగ్‌లు అలవాటు చేస్తున్నారు. బెట్టింగ్‌కు బానిసైన వారు ఆటేదైతేనేం అంటూ.. బెట్టింగ్‌లకు పెడుతూ డబ్బులు వృధా చేస్తున్నారు. క్రికెట్ అవ్వగానే ప్రో కబడ్డి, ఇంటర్ నేషనల్స్ క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్, బ్యాడ్మెంటెన్ ఇతర ఆటలకు ఎక్కవగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. తేలికగా డబ్బులు సంపాధించాలనే వక్ర బుద్ధితో యువత తప్పుద్రోవ పడుతున్నారు. బెట్టింగ్ నిర్మూలించేందుకు పోలీసులు సముచితంగా లేనట్టు కనిపిస్తుంది. బెట్టింగ్ మహమ్మారిని ఇలా వదిలేస్తే.. వైరస్‌లా పెరిగిపోయి ఎంత మంది జీవితాలను నాశనం చేస్తుందో ఊహకందనిది. కావున తల్లిదండ్రులు తమ పిల్లలు డబ్బును దేనికి, ఏవిధంగా వాడుతున్నారో గమనించాలి. తప్పుద్రోవ పడుతున్నారని పసిగడితే కౌన్సిలింగ్ ఇచ్చి సమాజ విలువలు, బెట్టింగ్ నష్టాలు తెలిపి వారిని మార్చే ప్రయత్నం చేయాలి. లేదంటే బెట్టింగ్‌లో నష్టోపోయి చెప్పుకోలేక వారి జీవితాలను బలి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బెట్టింగ్‌లపై పోలీస్‌శాఖ కొరడా జులుపించి యువతను సక్రమార్గంలో నడిపే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకు ఇప్పటికైన పోలీస్‌శాఖ బెట్టింగ్ మూలాలను కత్తిరించి, వాటిని నడిపేవారిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తే బెట్టింగ్‌ల నుండి యువతను, నవసమాజ పౌరులను కాపాడినవావుతారు. పోలీస్‌శాఖ బెట్టింగ్‌ను నియంత్రించేందుకు ఇప్పటికైన చర్యలు చేపడతారా.. లేదా పోలీస్‌శాఖ గురించి షికార్లు చేస్తున్న పుకార్లను నిజం చేస్తారా వేచి చూడాలి.