Home పెద్దపల్లి నిర్లక్షం వహిస్తే ఖబర్దార్

నిర్లక్షం వహిస్తే ఖబర్దార్

MLA-image

రోగులకు సక్రమంగా సేవలందించండి
మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది
ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలో వైద్యులకు దాసరి క్లాస్

మనతెలంగాణ/పెద్దపల్లి: ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు నిర్లక్షంవహిస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఎంఎల్‌ఎ దాసరి మ నోహర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడి గి తెలుసుకున్నారు. సిబ్బంది గైర్హాజర్, హాజరైన ఉద్యోగులు అంటెండెన్స్ రిజిష్ట్రర్‌లో సంతకాలు చేయక పోవడం, ఆసుపత్రి అపరిశుభ్రంగా ఉండ డంపై ఎంఎల్‌ఎ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీల వార్డులో కనీసం ప డుకోడానికి దుప్పట్లు కూడా వేయలేదా అని ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లేశంను ప్రశ్నించారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశా పెట్టి ప్రజలకు సేవలందిస్తుంటే కొన్ని విభాగాలు అనుసరిస్తున్న తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎంఎల్‌ఎ దాసరి ఆక్షేపించారు. గతం లో అధికారులు, ప్రజాప్రతినిధులు పలు మార్లు హెచ్చరించినా ప్ర భుత్వాసుపత్రి సిబ్బంది పనితీరు మారడం లేదని, ఇకనైనా పనితీరు మా ర్చుకోకుంటే ఇంటికెళ్లాళ్సి ఉంటుందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కో ట్లాది రూపాయలు వెచ్చించి ఆసుపత్రులలో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిని ప్రజలకు సక్రమంగా అందేలా వైద్యులు పనిచేయాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా రోగులకు సేవలందించినపుడే ప్రభుత్వాసుపత్రుల పట్లప్రజలకు నమ్మకం కలుగుతుందని అన్నా రు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్ వల్ల ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాల రేటు పెరిగిందని, వాటిని మరింత పేరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని 200 ప డకల ఆసుపత్రిగా మార్చేందుకు కావలసిన నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని,ప్రస్తుతం ఆసుపత్రి ఆవరణలోజరుగుతున్న భవన నిర్మాణాలను పూర్తి చేసి ఆసుపత్రిని అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.