Home ఆఫ్ బీట్ స్థిరాస్తి కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త

స్థిరాస్తి కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త

బ్రోకర్ల మాట నమ్మొద్దు
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ చూడాలి
సర్వే నెంబర్ వివరాలు తెలుసుకోవాలి
లేఅవుట్ అనుమతులపై ఆరా తీయాలి
అపార్ట్‌మెంట్ల విషయంలోనూ జాగ్రత్త అవసరం

సార్ ఇదిగో ఇటు చూడండి ఇక్కడ 200 ఎకరాల్లో ఐటీ పార్క్ రాబోతుంది. ఫలానా సంస్థ వేల ఎకరాల్లో ఇంటర్నే షనల్ లెవల్ లగ్జరీ విల్లాస్‌ను నిర్మించేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. ఎయిర్‌పోర్టు కూడ దగ్గర్లోనే … ఇప్పడైతే గజం కేవలం రూ. 5 వేలే రెండు నెలలు ఆగితే రూ.10 అవుతుంది….ఇలా నగర శివార్లలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెప్పే మాయమాటలు విని మోసపోతున్నవారెంతమందో ఉన్నారు..

LFE

డబ్బులు వెచ్చిస్తే స్థలం ఎక్కడైనా దొరుకుతుందని అనుకుంటే పొరపాటే. స్థలం దరికినా ఎలాంటి వివాదం లేని ప్లాట్/ స్థలం ఉండటం మృగ్యమైన కాలమిది. అందుకే జాగ్రత్త పడాలని ప్రభుత్వం సూచిస్తోంది. కష్టపడి కూడబెట్టిన డబ్బులను ఖర్చు పెట్టేటప్పుడు వెయ్యి కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంట్లో నుంచి కాలు కదపకుండా బ్రోకర్ మాటలను నమ్మి పెట్టుబడి పెడితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. డూప్లికెట్ డాక్యుమెంట్లు, ఫేక్ ఐడీ ప్రూఫ్స్ తయారు చేసి స్థ్ధలాలు అమ్మే ముఠాలు అనేకం ఉన్నాయి. అందుకే రూ.లక్షలు పోసి ప్లాట్ కొనేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అసరం ఎతైనా ఉంది.
ప్రాపర్టీ కొనుగోలుకు ముందు : –మనకు ప్రాపర్టీ అమ్మే వ్యక్తికి అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. -డాక్యుమెంట్‌లో ఆ యజమాని ఎవరి దగ్గర కొన్నాడు?ప్రాపర్టీ ఎన్ని చేతులు మారిందో తెలుసుకోవాలి.
డాక్యుమెంట్లు పరిశీలన : ఏదైనా స్థ్ధలం ప్లాట్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ముఖ్యం. డాక్యుమెంట్‌ను పూర్తిగా చదవాలి. -డేట్ ఆఫ్ ఎక్స్‌క్యూషన్, అమ్మినా వారి పేరు, మీ పేరుల్లో అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. -షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ, హద్దులు సరిగ్గా రాశారో చూడాలి.డాక్యుమెంట్‌లోనూ, ప్లాన్‌లోనూ హద్దులు ఒకేలా ఉండాలి. -ప్లాన్ పేపర్‌లో నార్త్ పాయింట్ కరెక్టుగా ఉందో లేదో చూసుకోవాలి.
రిజిస్ట్రేషన్‌కు తెలిసిన వారినే సాక్షులుగా తీసుకెళ్లాలి.
స్థలంపై విచారణ అవసరం.. సర్వే నంబర్ ప్రభుత్వ భూమిదా? వక్ఫ్,దేవాదాయ శాఖలకు సంబంధించినా అని తెలుసుకోవాలి. -ప్రభుత్వం సదరు స్థలాన్ని ప్రజాపయోగ కార్యాలయాలు, మాజీ సైనికులు, స్వాతంత్స్ర సమరయోధులకు కేటాయించిందా అనేది చూడాలి. అసైన్ చేసిన భూమి అయితే పదేళ్లు గడిచే వరకు క్రయ విక్రయాలు చేయడం కుదరదు. -ల్యాండ్‌లెస్ పేదలకు కేటాయించిన భూమిలో ప్లాట్లు కొనొద్దు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఆ భూములను ఏ సమయంలోనైనా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. – ఈ వివరాలన్నీ తహసిల్దార్ లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తెలుసుకోవచ్చు. -అన్నింటి కంటే ప్రధానమైనదది మీరు తీసుకునే స్థ్ధలంలో లేఅవుట్ ఆప్రూవ్డ్ చేశారా? జీహెచ్‌ఎంసీ/ హెచ్‌ఎండీఏ నుంచి ఆమోదం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. -బ్రోచర్లు, వెంచర్లు, క్లాసిఫైడ్ ద్వారా భూములను అమ్మేవాళ్లు వ్యక్తులైనా, సంస్థ్ధలైనా నేరుగా కలిసి వాళ్లు ఎలాంటి వారన్న విషయాలను విచారించాలి.
పొలం కొనేటప్పుడు..
-తహసిల్దార్ కార్యాలయంలో అవసరమైన మేరకు చలానా కట్టి మండల సర్వేయర్‌తో సర్వే చేయించాలి. -పాసు పుస్తకంలో ఉన్న దానికి పొజిషన్‌కు సరిపోవాలి.-ఆఫ్ డేటెడ్ ఆన్‌లైన్ రెవెన్యూ రికార్డు ఇన్ఫర్మేషన్(వెబ్ ల్యాండ్)లో సరిచూసుకోవాలి. -పొలం డాక్యుమెంట్ రిజిస్టరైన వెంటనే ఆన్‌లైన్‌లో తహసిల్దార్ కార్యాలయానికి చేరుకుటుంది. తహసీల్దార్ ఆటోమెటిక్‌గా మ్యూషన్ చేసి 45 రోజుల్లోగా టైటిల్ డీడ్, పాసు పుస్తకం ఇవ్వాలి. ఒక వేళ ఇవ్వకపోతే తహసిల్దార్‌ను సంప్రదించాలి.
అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ కొనేటప్పుడు..
-అపార్ట్‌మెంట్‌కు జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీఏ ఆప్రూవల్ ఉందా? ఉంటే ఎన్ని అంతస్తులకు అనుమతి ఉంది? బిల్డింగ్‌ను అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారం కట్టారా? అనే విషయాలను తెలుసుకోవాలి. ఏవైనా ఉల్లంఘనలు జరిగితే చట్టప్రకారం అధికారులు ఎప్పడైనా దాన్ని కూల్చవచ్చు. డీవియేషన్ ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్‌ని జీవితాంతం ఫెనాల్టీతో చెల్లించాల్సి వస్తోంది. -అన్నింటి కంటే ప్రధానంగా మనం తీసుకునే ప్లాట్‌కు యూడీఎస్ (అన్ డివైడెడ్ షేర్) ఎంత ఉందో చూసుకోవాలి. -యూడీఎస్ అంటే మన ప్లాట్ ప్లింథ్ ఏరియాకు సమానంగా కింద స్థలంలో మనకు వచ్చే భూమి. అది ఎలా, ఎంత ఇచ్చారన్నది చూసుకోవాలి. -కారు పార్కింగ్ విషయాన్ని కూడ సేల్ డీడ్‌లో వచ్చేటట్లుగా చూసుకోవాలి. -మోడల్ ఫ్లాట్ చేసి మోసపోవద్దు. అక్కవ వాస్తవం ఏమిటో ప్రత్యక్షంగా చూసి అంచనా వేయాలి. -బిల్డింగ్ నిర్మాణంలో స్టీల్, సిమెంట్,తలుపులు, కిటికీలు, ప్లోరింగ్ తదితర విషయాల్లో నాణ్యత ఎంత ఉందో చూసుకోవాలి. ఎలక్ట్రిసిటీ వైరింగ్, సానిటరీ ఐటమ్స్ కూడా నాణ్యతంగా ఉన్నాయా? లేదా చూడాలి.
-బ్రోచర్‌లో చూపిన ఎమినిటీస్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారా? లేదా? ఇలాంటి అన్ని అంశాలను తెలుసుకోవాలి.
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ : స్థలాన్ని ఎవరెవరు కొనుగోలు చేశారన్న విషయాలు తెలుసుకోవడానికి ఎనకంబరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి. మీ సేవా కేంద్రంలోగానీ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోగానీ ఈ సర్టిఫికెట్ పొందవచ్చు.ప్రస్తుతం ఎవరిపేరిట ఉన్నదో తెలుస్తోంది. రిజిస్టరైన డాక్యుమెంట్ల వివరాలన్నీ ఈసీలో తెలుస్తాయి. ఐతే ఒకవేళ తనఖా పెట్టినా, ఎవరికైనా అమ్మి క్రయ ఒప్పందం స్టాంప్ పేపర్ మీద రాసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయి ఉంటారు. అలాంటి విషయాలు ఈసీలో రావు. అలాంటి ప్రమాదం ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా న్యూస్‌పేపర్‌లో న్యాయవాది చేత ప్రకటన ఇప్పించాలి.

ఎం. సతీష్‌ముదిరాజ్,
మనతెలంగాణ ప్రతినిధి