Home అంతర్జాతీయ వార్తలు ఉ.కొరియాతో జాగ్రత్త చైనాకు అమెరికా సూచన

ఉ.కొరియాతో జాగ్రత్త చైనాకు అమెరికా సూచన

north-koreaవాషింగ్టన్: ఉత్తర కొరియాతో మామూలు సం బంధాలను కొనసాగించడం చైనా మానాలని అమెరికా సూచించింది. హైడ్రొజన్ బాంబు పరీక్షను విజయవంతంగా జరిపినట్లు ప్రకటించి ప్రపంచ దేశాలను ఆ దేశం ధిక్కరించి నందున మిత్రదేశంగా దానిని చూడ్డం ఇక మానాలని అమెరికా పిలుపునిచ్చింది.
సరిహద్దుల వెంబడి ద. కొరియా ప్రచార సన్నాహాలు
సరిహద్దుల వెంబడి వ్యతిరేక ప్రచారాల ద్వా రా ఉత్తర కొరియా చర్యను తిప్పికొట్టాలని దక్షి ణ కొరియా సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కొంతకాలంగా చైనాకుగ్గరవుతున్న దక్షిణ కొరియా తన విదేశాంగ మంత్రిని చైనాతో చర్చలకు పంపింది. ఉత్తర కొరియా పట్ల చైనా వైఖరి మారాలని గురువారం అమెరికా విదే శాంగ మంత్రి జాన్ కెర్రీ చైనా మంత్రి వాంగ్ ఈకి ఫోన్ చేసి సూచించారు.