Home నల్లగొండ పాములతో జరభద్రం

పాములతో జరభద్రం

వర్షాకాలంలో అప్రమత్తత అవసరం

నాటువైద్యాన్ని నమ్ముకోవద్దు
దవఖానాలో విరుగుడు మందు

                        Snake

భానుపురి : వర్షాకాలంలో పా ముల బెడద అధికంగా ఉంటుంది. వర్షాలకు పా ములు బయటకు వస్తాయి. రాత్రి వేళల్లో నివాసా ల్లోకి ప్రవేశిస్తాయి. ఖరీఫ్ సీజన్‌లో సాగుకు సిద్ధమ వుతున్న సమయంలో పాములు బయటకు రావడం స హజం. ఏటా పాముకాటుకు గురై ఎంతోమంది మృతి చెం దుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకో వా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. కట్ల పాము కాటేసిన క్షణాల్లో విషం రక్తకణాలలో కలు స్తుంది. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే దవాఖానాలో చేర్చాలి. నాగు పాము కాటేసిన 15 నిమిషాలలో విషం ఎక్కుతుంది. రక్తపింజర కాటేసిన రెండు గంటల తర్వాత విషం ఎక్కుతుంది. జెర్రిపోతు, నీరుకట్ల పాము కాటేసిన విషం ఉండదు. అయితే కాటేసిన చోట చికిత్స చేయడానికి దవాఖానకి తీసుకెళ్లాలి.

విష సర్పాలు రెండు రకాలు : న్యూరోటాక్సిల్ రకం నా గు పాము, కట్ల పాము. రెండో రకం హిమో టాక్సిన్ అనగా రక్తపింజర పాము, న్యూరో టాక్సి న్‌తో నోటి ద్వారా నురుగు వచ్చి శ్వాస ఆడక మృతి చెందే ప్రమాదముంది. హిమోట్యాక్సిన్‌తో రక్తనాళాల్లో కన జాలం నశించి కాటు పడిన భాగంలో వాపు వస్తుం ది. కాటేసినది ఎలాంటి పాము తెలుసుకుంటే చికిత్స చాలా సులభం. ప క్క పక్కన రెండు తదంతాలు కాటు వేస్తే అది ఖ చ్చితంగా విష పామే అనుకోవాలి. పాము కా టుతో ఉ న్న భాగం నుండి శరీరంలోకి రక్త ప్రసరణలో విషం వ్యా ప్తిం చెందే అవకాశం ఉంది.

మంత్రగాళ్లను ఆశ్రయించవద్దు : గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా మూడ నమ్మకాలు ఎక్కువ. దీనితో వైద్యులను సంప్రదించకుండా మంత్రగాళ్లను ఆశ్రయిస్తుంటారు. పాము కాటుకు వైద్యం ఉంది. పాము కాటుకు గురైన వారు మంత్రగాళ్లను ఆశ్రయించవద్దు. విష సర్పం కాటేసినప్పుడు దవఖానాకు తీసుకుపోకుండా నాటు వైద్యుడిని ఆశ్రయిస్తే వారి మిడి మిడి పరిజ్ఞానంతో చేసే వైద్యం కారణంగా బాధితులు ప్రా ణాలు కోల్పొయే అవకాశం ఉంది. విషం లేని పాము కాటుకు గురైన వారు ప్రాణాలతో బయట పడి మం త్రగాళ్ల మహిమ వల్లనే నమ్ముతుంటారు. ఇదే బాధితుల పాలిట ముప్పుగా మారుతుంది. సకా లంలో వైద్యం అందక ఎంతో మంది మృత్యు వా త పడుతుంటారు. సరైన సమస్యలో వైద్యు లను సంప్రదిస్తే పామును బట్టి చికిత్స చేస్తారు.

అప్రమత్తంగా ఉండాలి : సాధ్యమైనంత వరకు పా ములు, విష కీటకాల బారిన పడకుండా ఉండా లి. రాత్రిపూట పొలాల వద్దకు చేతిలో కర్ర, టార్చ్ లై టు తీసుకెళ్లాలి. కప్పలు, ఎలుకలు ఉన్న చోట పాము లు సంచరిస్తుంటాయి. ఇంటి ఆవరణలో కంపచెట్లు, పిచ్చి మొక్కలు, రంధ్రాలు, నీరు నిల్వ ఉం చకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇళ్లలో ఎలుకలు ఉంటే పాములు వస్తాయి. చిన్నారులను రాళ్ల, చెట్ల పొదల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.

ఆందోళన అవసరం లేదు : పాము కాటుకు గురైనప్పుడు ఆందోళనకు గురి కావద్దు. ఇది గుండె పోటకు దారితీస్తుంది. ప్రాథమిక చర్యగా కాటు వేసిన ప్రదేశంలో పైభాగంలో కట్టు కట్టాలి. ఆ వెంటనే చికిత్స కోసం వెళ్లాలి. పాము కాటుకు గురైన వారు దవాఖానకు వెళ్లి స్పష్టంగా చెప్తే దానికి సంబంధించిన చికిత్స చేస్తారు. అక్కడ యాంటి స్నేక్, వినం ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయి.

పాము కాటు లక్షణాలు : వ్యక్తిని విషపూరితమైన పాము కరిస్తే శరీరమంతా నీళం రంగు గా మారటం, రక్తపోటు తక్కువగా ఉంటే స్పృహ కోల్పొతారు. కరిసిన చోట నొప్పివాపు ఉంటుం ది. కొందరిలో పొక్కులు, దద్దుర్లు కనిపిస్తాయి. నోటి నుండి నురద వస్తుం టుంది. ఆయా సపడి చెమటలు పట్టి, ఉంటే సాధారణ స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో కొట్టుకుంటుంది.