Home టెక్ ట్రెండ్స్ మీ కార్డులు జాగ్రత్త

మీ కార్డులు జాగ్రత్త

ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మనకి ఏమాత్రం తెలీకుండానే అకౌంట్లు హ్యాక్ అయిపోతాయి. డబ్బు హుష్ కాకి అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?

Cyber-crime2నమ్మదగిన వెబ్‌సైట్ నుంచే షాపింగ్ చెయ్యాలి. తప్పు స్పెల్లింగ్‌లతో లేక విభిన్నమైన డొమెయిన్ పేర్లతో(ఉదాః xyz.com బదులుగా cyz.net లాటివి) పెట్టడం చేస్తుంటారు. నిజానికి ఇవన్నీ పాత ట్రిక్‌లే. కొంచెం అప్రమత్తంగా ఉండాలి.
లాక్ గురించి చూడాలి
ఎప్పుడూ మీ బ్రౌజర్‌లో ఆకుపచ్చ రంగులో ఉండే లాక్‌డ్ ప్యాడ్‌లాక్ కోసం చూడాలి. అదే ఎరుపు రంగు కనిపిస్తే సురక్ష గురించి అప్రమత్తంగా ఉండాలి. సెక్యూరిటీ ప్యాడ్‌లాక్ మీద క్లిక్ చేస్తే సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్‌లకు తగ్గట్టు ఉందా లేదా కనిపిస్తుంది. సెక్యూరిటీ సాకెట్ లేయర్ లేని సైట్ నుంచి మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేయద్దు. అడ్రస్ బార్‌లో https:// అని ఉండాలి. కాని http://
అని ఉండకూడదు. S అంటే సెక్యూర్ అని అర్థం. మాల్‌వేర్‌ను, ఫ్రాడ్ ప్రొటెక్షన్ బ్రౌజర్‌ను వేసుకోవచ్చు. అప్పుడు అది ఎప్పటకప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది.
మీ పాస్‌వర్డ్‌ని రక్షించుకోవాలి
సాధారణ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తే హ్యాక్ చేయడం సులువు. సైబర్ దొంగతనాలు చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. నంబర్లు, చిహ్నాలు, లోవర్ కేస్, అప్పర్‌కేస్ అక్షరాలతో ఛేదించలేనంత బలంగా ఉండాలి. ప్రతీ 3 నుంచి 6 నెలల లోపు పాస్‌వర్డ్ మారుస్తుండాలి. కంప్యూటర్ పాస్‌వర్డ్ గుర్తు పెట్టుకునేలా చేయకూడదు. ఆన్‌లైన్ షాపింగ్ , బ్యాంకింగ్ సైట్లను లాగ్‌అవుట్ చేశారో లేదో గుర్తు పెట్టుకోవాలి. ఈమెయిల్స్ పంపి వ్యక్తిగత సమాచారం అడిగే వారికి చెప్పకూడదు.
సరికొత్త సాఫ్ట్‌వేర్ వేయాలి
జరిగాక బాధపడటం కంటే జరగకుండా చూసుకోవాలి. మాల్‌వేర్, స్పామ్, స్పైవేర్ నుంచి రక్షింపకోడానికి మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ వేసుకోవాలి. సిస్టమ్‌ని వెనక డోర్ నుంచి లోనికి తెప్పించగల ఫిషింగ్, ట్రోజన్స్ అనే కంప్యూటర్ ప్రోగ్రామ్‌నుంచి కంప్యూటర్‌ను రక్షించడానికి బలమైన సైబర్ సెక్యూరిటీ కవచాన్ని ఏర్పరచాలి.
సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి
ఆపరేటింగ్ సిస్టమ్‌ను, నమ్మదగిన వెబ్‌సైట్ నుంచి ప్రొటెక్టివ్ ప్యాచెస్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని అధునాతన బ్రౌజర్‌ను అప్‌టుడేట్ చేసుకోవాలి. చాలావరకు ఆపరేటింగ్ సిస్టమ్‌లు సెక్యూరిటీ లోపాలు కలిగిఉంటుంది. అందుకే ఎక్కువ హ్యాకింగ్‌కి ఎక్కువ గురవుతుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సెక్యూరిటీ అప్‌డేట్స్ తప్పనిసరి. మీ కంప్యూటర్‌లో ఉన్న అడోబ్ రీడర్, జావా, ఫ్లాష్ లతోపాటు క్రోమ్, ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్లు కూడా ప్రమాదాల్ని సృష్టించగలవు. మీ సాఫ్ట్‌వేర్ మొత్తానికి ఆటో అప్‌డేట్ ఆప్షన్ ఉంచితే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంది.
చెప్పద్దు
పాస్‌వర్డ్ లేక ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్ స్టోర్స్‌లో షేర్ చేయద్దు. వీలైనంతవరకు చాలా తక్కువ సమాచారాన్ని బయటకు తెలపండి. బ్యాంకు అకౌంట్ల లాటివి ఆన్‌లైన్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇంటర్నెట్‌లో మీ పనుల ఆధారంగా ఏదైనా హ్యాక్ చేయచ్చు. సాధ్యమైనంత వరకు ఆర్థిక లావాదేవీ కోసం స్వంత కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్లు వాడుకోవాలి. పబ్లిక్ కంప్యూటర్లు వాడితే చాలా తేలిగ్గా హ్యాకింగ్‌కి గురవుతారు. ఒకవేళ మీరు వైఫై వాడుతుంటే అది సెక్యూర్డ్‌గా ఉందో లేదో చూసుకోవాలి. పబ్లిక్ వైఫై కనెక్షన్‌తో ఆర్థిక లావాదేవీలు చేయడం ఎంతమాత్రం సూచించతగింది కాదు. మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండాలంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(విపిఎన్) సేవలను వినియోగించుకుని మీ కంప్యూటర్‌కు. మీరు సందర్శించే సైట్ కనెక్షన్‌ను వ్యక్తిగతంగా, పాస్‌వర్డ్‌తో సురక్షితంగా ఉంచుకోవాలి.
స్మార్ట్‌ఫోన్ సురక్ష
కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ అన్నీ అప్‌డేట్ చేసుకుంటే సురక్షా లోపాలుండవు. దానికి కొన్ని టిప్స్ ఇవిః
పిన్, పాస్‌వర్డ్, ప్యాటర్న్ లాక్‌తో ఫోన్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నమ్మదగిన వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే యాప్‌లను వేసుకోవాలి.
బ్రౌజర్ ఉపయోగించడం కంటే బ్యాంకువారి అప్లికేషన్‌ని మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమం. మీ నెట్‌బ్యాంకింగ్ ఎకౌంట్‌ను సందర్శించిన తర్వాత cache డిలీట్ చేయడం మరవకూడదు. బ్యాంకింగ అప్లికేషన్లు ప్రతిసారి లాగిన్ పాస్‌వర్డ్‌లను అడగాలి. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. వ్యక్తిగతమైన సమాచారం ఫోన్‌లో స్టోర్ చేసుకోవడం మానేయాలి. అలాటప్పుడు మొబైల్‌కి రిమోట్ వైప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫోన్ పోయినా కూడా అందులో నుంచి మీ గురించిన మొత్తం సమాచారాన్ని డిలీట్ చేసుకోవచ్చు.
వైఫై, బ్లూటూత్‌ను వినియోగంలో లేనప్పుడు ఆపేయాలి. స్మార్ట్ దొంగలు ఉంటారు. మీ ఫోన్ లేదా కంప్యూటర్‌కి కనెక్ట్ అయి మీ ఫైల్స్‌ని వినియోగించవచ్చు. ఏదైనా బ్యాంకు లేదా బిజినెస్ సంస్థ నుంచి మీ అకౌంటు వివరాలను తెలపమని ఈమెయిల్ వస్తే వారితో ప్రత్యక్షంగా సంప్రదించకుండా ఇవ్వద్దు.
ప్రకటనలతో వ్యవహరించినప్పుడు
ఈకామర్స్ వెబ్‌సైట్ నుంచి ప్రమోషనల్ మెయిల్స్ రావడం చాలా సాధారణం. వాటిని ఉపయోగించడానికి కూపన్ లింక్‌లో వివరాలు ఉంచడం కన్నా మెయిన్ సైట్‌కి వెళ్లడం ఎక్కువ సురక్షితం.
పిన్‌కోడ్, స్టేట్‌మెంట్‌లు చెక్ చేయాలి
బ్యాంకులు నిర్వహించే ఎటిఎమ్‌లు చాలా సురక్షితం అనిపస్తాయి కాని అన్ని వేళలా కావు. మనదేశంలో దాదాపు 70 శాతం ఎటిఎమ్‌లు ఔట్‌డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో నడుస్తున్నాయి. దానివలన మాల్‌వేర్, మోసం జరిగే అవకాశం ఉంది. ఎటిఎమ్ లావాదేవీల ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్‌ల కోసం సైనింగ్ అప్ చేయడం వలన మీకు ఉపయోగంగా ఉంటుంది. అయినా మీ కార్డుల పిన్ ను ఎప్పటికప్పుడు ఆరు నెలలకొకసారి మారుస్తుండాలి. మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్లను సమీక్షించుకుంటుండాలి. ఒకవేళ మీ కార్డులు దుర్వినియోగం అయ్యాయి అనుకుంటే వెంటనే ఆపేయచ్చు. కాని నిర్లక్షంగా ఉండకుండా అప్రమత్తంగా ఉంటుంటే, మీ కార్డు వివరాలు ఎవరైనా ఆన్‌లైన్‌లో వినియోగిస్తే మీరు పోగొట్టుకున్న డబ్బు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది.