Wednesday, April 17, 2024

బ్లాక్ ఫంగస్‌తో జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

Beware of black fungus:ICMR guidelines

ఐసిఎంఆర్ మార్గదర్శకాలు

కొవిడ్ తరువాతి పరిణామం
వ్యాపిస్తే అంతటా ప్రమాదకరం

న్యూఢిల్లీ : కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఇప్పుడు మ్యుకర్‌మైకోసిస్ అనే బ్లాక్ ఫంగస్ వ్యాధి తలెత్తడం ఆందోళన రేకెత్తించింది. ఈ దశలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) సోమవారం దీని పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలను వెలువరించింది. గుజరాత్, హర్యానా ఇతర ప్రాంతాలలో కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ ఏర్పడటం, దీనితో పలువురికి కంటిచూపు పోవడం, అవయవాలు దెబ్బతినడం, ప్రాణాంతకం అవుతున్న ఘటనలు జరిగాయి. దీనిని వెంటనే నియంత్రించాల్సి ఉందని లేకపోతే ఇది కరోనా అనుబంధపు ప్రాణాంతకపు వ్యాధి అవుతుందని ఐసిఎంఆర్ అభిప్రాయపడింది. కొవిడ్‌కు గురై చికిత్స పొందుతున్న వారిలో ఉండే రోగనిరోధక శక్తి లేమితో ఇది దాడి చేసే ప్రమాదం ఉంది. అనేక రకాల చికిత్సలతో ఎక్కువకాలం ఐసియూలలో ఉండాల్సిన వారికి కూడా ఈ ఫంగస్ వ్యాపిస్తోంది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో పర్యావరణంలోని బ్యాక్టీరియాతో తలపడే శక్తి తక్కువగా ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని ఇది వ్యాపిస్తుంది.

ఫంగస్ సోకిన వారిలో లక్షణాలు

ఇది సోకిన వారి కళ్లు, ముక్కు ఎర్రబారుతాయి. తలనొప్పి, ఒళ్లునొప్పులు, దగ్గు జ్వరం, శ్వాస తీసుకోలేకపోవడం, రక్తవాంతులు చివరికి మతిస్థిమితం తప్పడం వంటివి జరుగుతాయి. ఛాతీనొప్పి, ముక్కుమూసుకుపోవడం, దవడ నొప్పి, కంటిచూపు మందగించడం, ఒక వస్తువు రెండుగా కన్పించడం వంటివి ప్రాధమిక లక్షణాలు. వివిధ స్థాయిల నిపుణులు వైద్యుల ప్రత్యక్ష అనుభవాలను తీసుకుని ఐసిఎంఆర్ మార్గదర్శకాలు వెలువరించింది. అత్యధిక స్థాయిలో మధుమేహం ఉండటం, దీనికి సంబంధించి ఎక్కువ మందులు వాడాల్సి రావడం వంటివి ఈ ఫంగస్‌కు దారితీస్తాయి.

తీసుకోవల్సిన జాగ్రత్తలు

షుగర్ వ్యాధిని తగు విధంగా అదుపులో పెట్టుకోవాలి.
స్టెరాయిడ్స్ వాడకాన్ని నిలిపివేయాలి.
అత్యధిక స్థాయి ఇమ్యూనో మందులకు విరామం ఇవ్వాలి.
హైపర్‌గ్లిసిమియాను అదుపులో పెట్టుకోవాలి.
స్వచ్ఛమైన, స్టెరైల్ నీరు తీసుకోవాలి.
యాంటీబయోటిక్స్, యాంటిఫంగల్స్‌ను తగు విధంగా వాడాలి .
దుమ్మూధూళి ప్రాంతాలకు, నిర్మాణాల ప్రాంతాలకు వెళ్లకూడదు.
కరోనా నుంచి కోలుకున్న వారు ఎక్కడికి వెళ్లినా మాస్క్‌లు వీడవద్దు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News