Search
Wednesday 26 September 2018
  • :
  • :

యాదాద్రి మాదిరిగానే భద్రాద్రి

తెలంగాణలో ఆలయాలకు మహర్ధశ
త్రిదండి చినజీయర్ స్వామి
భద్రాద్రి ఆలయ అభివృద్ధి  మాస్టర్ ప్లాన్ పరిశీలన

Chinna-Jeeyar-swamy1

భద్రాచలం: యాదాద్రి మాదిరిగానే భద్రాద్రి కి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యుం కల్పించేందుకు సిఎం కెసి ఆర్ తీసుకున్న నిర్ణయం బాగుందని త్రిదండి చినజీయర్ స్వా మి అన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ. 100 కోట్ల తో చేపట్టాల్సిన పనులు, తయారుచేసిన మాస్టర్‌ప్లాన్ అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి కోరిక మేరకు ఆయన బుధవా రం ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో భద్రాచలం చేరుకున్నారు. ఈ సం దర్భంగా గర్భగుడిలోని శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. వాటి గు రించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆల య ప్రాంగణంలో విలేకరుతో మాట్లాడా రు. తెలంగాణ ప్రాం త ఆలయాలకు మహర్ధశ పట్టిందని, ఆలయాలకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇవ్వగలిగితే ఆ ప్రాంతం ఆర్థికంగా, భక్తిభావంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్, స్థపతి బృం దం తయారుచేసిన ప్లాన్‌ను తాను పరిశీలించానని, దానిలో తనకు తోచిన మార్పులు, చేర్పులకు సలహాలు అందించినట్లు చెప్పారు. ఆగమ, స్థానిక పెద్దలతో కమిటీ ఏర్పాటు చేసి ఈ ఆలయానికి ఇప్పటివరకు సాగుతున్న రామదాసు పరంపర ఎక్కదా దెబ్బతినకుండా, సత్సంప్రదాయానికి భంగం వాటిల్ల కుండా, ఆగమశాస్త్రానుసారం భక్తులు దర్శనం చేసుకునేలా తగిన రీతిలో సిద్ధం చేస్తారన్నారు.

ప్రస్తుతం పరిశీలన నివేది క, గతంలో తయారుచేసిన ప్లాన్‌ను ముఖ్యమంత్రి దృష్టికి తీ సుకెళ్తానని చెప్పారు. దానిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంత రం ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం మరో సారి భద్రాద్రికి వచ్చి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేస్తారని వివరించారు. అంత కుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత శ్రీరామ నవమికి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాద్రి అభి వృద్ధికి ప్రకటన చేశారని, ఆ ప్రకటన అనుసారంగానే ఇప్పు డు చినజీయర్ స్వామి వచ్చారని గుర్తుచేశారు. వీరి వెంట భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట ఎంఎల్‌ఎలు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఈవో రమేశ్‌బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments