Home ఖమ్మం భద్రాద్రి పవర్‌ప్లాంట్ పనులను అడ్డుకున్న భూ నిర్వాసితులు

భద్రాద్రి పవర్‌ప్లాంట్ పనులను అడ్డుకున్న భూ నిర్వాసితులు

నిర్వాసితులు, పోలీసుల మధ్య తోపులాట

Untitled-1
పినపాక: తమ పంట భూములను ఎటువంటి నష్టపరిహారం, ఉద్యోగ హామీపత్రాలు ఇవ్వకుండా రైతులను మభ్యపెడు తున్నారని భద్రాద్రి పవర్‌ప్లాంట్ భూనిర్వాసితులు శనివారం ప్రహరీగోడ, గ్రౌండ్ లెవలింగ్ సాంబాయిగూడెం వద్ద స్టోరేజీ స్టాక్ పాయింట్ తదితర పనులను అడ్డుకుని కూలీలను, కాం ట్రాక్టర్లను బయటికి పంపించారు. బీహెచ్‌ఈఎల్ అధికారులను నిలదీసి పంట పొలాల నుండి వెళ్ళిపోవాలని రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో బీహెచ్‌ఈఎల్ అధికారులు వారి ముందే కంటైనర్‌లకు తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్ళి పోయారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఖచ్చితమైన హామీ ఇవ్వా లని ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ధర్నా చేపడుతూ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు మాటలు వెనక్కితీసుకోవాలని సీఎండీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

రైతులందరికీ న్యాయం జరగడం లేదని, ఎటువంటి ఉద్యోగ భద్రత పత్రాలు ఇవ్వలేదని పురు గుమందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటామని పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారి వద్ద ఉన్న పురుగుమందు డబ్బాలను లాక్కొని, వారించే ప్రయత్నం చేశారు కాని పోలీసులకు, రైతులకు మధ్య కొద్ది సేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతమంది రాజ కీయ నాయకులు, అధికారులు మాయమాటలు చెప్పి మమ్ములను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమకు న్యాయం చేయని ఎడల ఆత్మహత్యలు చేసుకుంటామని అన్నారు. భూనిర్వాసితులు, మణుగూరు సీఐ పెద్దన్నకుమార్, ఏడూళ్ళ బయ్యారం ఎస్సై సూర్యప్రకాశ్, సీపీఐ జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, ఎంపిటిసి కొండేరు రాము, బయ్యారం సర్పంచ్ కుంజా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.