Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

‘ఖాకీ’ల ప్రహారా నడుమ భద్రాద్రి థర్మల్ స్టేషన్ పనులు.

hadradi-Thermal-plant

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అందరికి అనుగుణంగా చేపట్టవలసిన పనులు పోలీస్ ప్రహారా నడుమ కొనసాగుతున్నాయి. తమ భూములు ఇచ్చే ముందు అధికారులు కొంత మంది రాజకీయ నాయకులు తమను మభ్య పెట్టి పాల్వంచ సబ్ కలెక్టర్, ఖమ్మం కలెక్టరేట్‌కు తీసుకెళ్ళి పంచపరమాన్నాలు పెట్టి భూదానం చేసిన వారు ఎంతో గొప్పవారు అని చెప్పి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో పాటూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారని భూ బాధితులు వాపోతున్నారు. నేటికి ఇంకా ఎంతో మంది పవర్‌ప్లాంట్‌లో భూములు కొల్పోయి తమ పరిహారం ఇప్పించమని అధికారులు కార్యాలయాల చుట్టూ పదే పదే తిరుగుతూనే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సాగుచేసుకుంటూ జీవిస్తున్న మా పంట పొలాలను తీసుకోని పరిహారం ఇవ్వమంటే అధికారులు వారి ఇష్టానుసారంగా మాట్లాడటమే కాక పరిహారం ఇవ్వకుండా మా పొలాల్లో పనులు చేయవద్దని అడ్డుకోగా జెన్‌కో, బిహెచ్‌ఇఎల్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పవర్‌ప్లాంట్ వద్ద ఉన్న భూ బాధితులను అక్కడి నుంచి పోలీసులు ఇష్టానుసారంగా ఈడ్చుకువెళ్తున్నారు. ఒక పంట కాక రెండు పంటలు పండే పొలాలు ఇచ్చి తమకు ఇదేమి బాధ అని నెత్తినోరు కొట్టుకుంటూ కన్నీరుమున్నీరుగా బాధితులు విలపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని అర్హులైన ప్రతీ ఒక్కరికి నష్టపరిహారం అందేవిధంగా చూడాలని బాధితులు కోరుకుంటున్నారు.

Comments

comments