Home తాజా వార్తలు ‘భద్రం బి కేర్‌ఫుల్ బ్రదరూ’ చిత్రం ట్రైలర్ విడుదల

‘భద్రం బి కేర్‌ఫుల్ బ్రదరూ’ చిత్రం ట్రైలర్ విడుదల

https://www.youtube.com/watch?v=PP4-WN3ogS4

హైదరాబాద్: చరణ్, రాజ్, హమీద ప్రధాన పాత్రల్లో మారుతి టీం వర్క్, సాయి వెంకట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తం నిర్మాణంలో ముళ్లపూడి రాంబాబు సమర్పణలో సంపూర్ణేష్‌బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భద్రం బికేర్ ఫుల్ బ్రదరూ’. రాజేష్‌పులి దర్శకత్వంలో బోణంకృష్ణ సతీష్, అడ్డగర్ల జగన్‌బాబు, ఉప్పూరీ బ్రహ్మాజీ నిర్మిస్తున్న చిత్రమిది. వి.వి.వినాయక్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయగా.  ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ “కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త దర్శకులు, కొత్త హీరోను తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేస్తున్న మారుతిని అభినందించాలి. ఈ చిత్రం ద్వారా కోటయ్య అబ్బాయి చరణ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. మారుతి మాట్లాడుతూ “ఒక మంచి టీమ్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాను. జెబి మంచి మ్యూజిక్ ఇచ్చారు”అని అన్నారు. చిత్ర దర్శకుడు రాజేష్‌పులి మాట్లాడుతూ “ఈ సినిమాలో సంపూర్ణేష్‌బాబు మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తాడు. ఇదొక పూర్తి వినోదాత్మక చిత్రం”అని చెప్పారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ “సినిమాలో నాచేత వైవిధ్యమైన డైలాగులు చెప్పించారు. వాటిని ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బోణంకృష్ణ సతీష్, అడ్డగర్ల జగన్‌బాబు, ఉప్పూరీ బ్రహ్మాజీ, హీరో చరణ్, సుమంత్ అశ్విన్, పరుచూరి వెంకటేశ్వరరావు, కళ్యాణ్‌కృష్ణ, చిన్నికృష్ణ, శ్రీవసంత్ తదితరులు పాల్గొన్నారు.