Home తాజా వార్తలు అంచనాలు పెంచేసిన ‘భైర‌వ‌గీత’ (ట్రైల‌ర్)

అంచనాలు పెంచేసిన ‘భైర‌వ‌గీత’ (ట్రైల‌ర్)

Bhairava Geetha

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ సమర్పకుడిగా ఆయన శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ప్రేమ కథ చిత్రం ‘భైర‌వ‌గీత’. తాజాగా ఈ మూవీ నుంచి రెండో ట్రైల‌ర్ విడుదలైంది. ఇంతకుముందు విడుదల చేసిన ట్రైలర్ తోనే ఆకట్టుకున్న మూవీ యూనిట్ రెండో ట్రైలర్ తో మరింత అంచనాలు పెంచేశారు. ఆర్ జివి సినిమాల్లాగే ఇందులో కూడా ఫ్యాక్షన్ మోతాదు కాస్తా ఎక్కువనే చెప్పాలి. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కొత్త నటీనటులు ధనుంజయ్, ఇర్రామోర్‌లు హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. ‘‘మనుషులను బానిసలుగా చూసే ప్రతి ఒక్కరి గుండెల్లో దింపే కత్తే దీనికి సమాధానం’’ అంటూ ఫ్యాక్షన్ పెద్దలపై కథనాయకుడి తిరుగుబాటును ఈ ట్రైలర్లో చూపించారు. అలాగే ‘‘సాటి మనుషులను బానిసలుగా చూడాలంటే నీ గుండెలు అదరాలి’’ అనే డైలాగ్  ట్రైలర్లో హైలైట్ గా ఉంది. ఈ చిత్రానికి వర్మ దర్శకత్వం వహించకపోయినా.. సిద్ధార్థ్‌కు అన్నివిధాలా సహకరించినట్లు తెలిసింది. ఈ నెల 22న తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి మూవీ విడుదల కానుంది.

Bhairava Geetha Official Telugu Trailer Released

Telangana Breaking News