Home ఆఫ్ బీట్ వీడియోలు ప్రేమ జంటలపై భజరంగ్ దళ్ కార్యకర్తల దాడి..!(వీడియో)

ప్రేమ జంటలపై భజరంగ్ దళ్ కార్యకర్తల దాడి..!(వీడియో)

Lovers

అహ్మదాబాద్: ప్రేమికుల రోజున భజరంగ్ దళ్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. ‘వాలెంటైన్స్ డే’ మన సంస్కృతి కాదని కనిపించిన ప్రేమజంటలను కర్రలతో వెంబడించారు. ఈ ఘటన ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ఒడ్డుకు వచ్చిన ఓ ప్రేమజంటను భజరంగ్ దళ్ కార్యకర్తలు కర్రలు చేతపట్టి వెంబడించారు. దాంతో ప్రేమికులు పరుగులు పెట్టారు. ప్రేమజంటను వేధించడం గమనించిన పోలీసులు రంగంలోకి దిగి బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు.