Search
Saturday 17 November 2018
  • :
  • :

అరె భలేగుందే… ‘భలేమంచి చౌక బేరమ్'(ట్రైలర్)

Bhale Manchi Chowka Beram Trailer

హైదరాబాద్: నవీద్నూ,కరాజు,యామిని ప్రధాన పాత్రలు పోషిస్తోన్న’భలేమంచి చౌక బేరమ్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. డైరెక్టర్ మారుతి అందించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘రోజులు మారాయి’ సినిమాతో దర్శకుడిగా మారిన మురళీకృష్ణ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోంది. ఓ మాజీ ఆర్మీ ఆఫీసర్ తన 30 సంవత్సరాల అనుభవంతో దేశ రహస్యాలను ఫైల్ చేసి ఉంచుతాడు. పెద్ద మొత్తానికి ఆ రహస్యాలను శత్రుదేశస్తులకు అమ్మేయడానికి సిద్ధపడతాడు. అయితే అనుకోకుండా ఆ ఫైల్ ఇద్దరు మిత్రులకు చిక్కుతుంది. క్యాబ్ డ్రైవర్కొ, కొరియర్ బాయ్ గా పనిచేస్తోన్న ఆ స్నేహితులు కూడా ఆ రహస్యాలను అమ్మేయాలనే నిర్ణయించుకుంటారు. అప్పుడు ఏం జరిగింది? అనే ఆసక్తి రేకెత్తేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments