Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

భాను కిరణ్‌కు ఏడాది జైలు

 Bhanu Kiran is jailed for one year

మన తెలంగాణ/ హైదరాబాద్ : మద్దెలచెరు వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితు డు భానుకిరణ్‌తో పాటు అతని ముగ్గురు అనుచరులకు నాంపల్లికోర్టు బుధవారం ఏడా ది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. భానుకిరణ్ తన అనుచరులతో కలిసి అక్రమంగా ఆయుధాలు (తుపాకులు, రివాల్వర్లు) సరఫరా చేస్తున్నాడని సమాచారం అందడంతో 2009 మార్చి 11న బేగంపేట పోలీసులు దాడిచేసి వారినుంచి 8 పిస్తోళ్లు, 12 తపంచాలు, 42 బుల్లెట్లు, 12 మ్యాగజెన్‌లను స్వాధీనం చేసుకున్నారు. భానుకిరణ్‌తో పాటు అతని అనుచరులు రాజశేఖర్‌రెడ్డి, కె. శివప్రసాద్‌రెడ్డి, డి.వినోద్‌లను అరెస్టు చేశారు. ఈ కేసు తదనంతరం సిఐడికి బదిలీ అయింది. ఈ కేసు దర్యాప్తును సిఐడి ఇన్‌స్పెక్టర్ ఎం.ప్రేమ్‌కుమార్ దర్యాప్తుచేసి చార్జీషీట్ దాఖలు చేశారు. పోలీసులు ఈ కేసులో సాక్షాధారాలను పకడ్బందిగా సేకరించారు. ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో నిందితులు ఆయుధాలు కలిగి ఉన్నారని కోర్టు నిర్ధారించింది. దీంతో ఈ నలుగురికి ఏడాది జైలుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కాగా మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్య కేసులో భానుకిరణ్ నిందితుడు. ఈ కేసు ఇంకా కోర్టులో విచారణ సాగుతుంది. చర్లపల్లి జైలులో ఉంటున్న భాను ఇక్కడి నుంచే భూ దందాలు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని జైలు అధికారులు నిర్ధారించారు.అయితే జైలు కేంద్రంగా భాను పలు అక్రమాలకు పాల్పడుతుండటంతో అతనిని చంచల్‌గూడ జైలుకు తరలించడానికి అనుమతి ఇవ్వాలని జైలు అధికారులు నాంపల్లి కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించడంతో చంచల్‌గూడ జైలుకు భానును ఏడాది క్రితం తరలించారు. మరో వైపు భానుకు ప్రాణహాని ఉండటంతో ప్రత్యేక బ్యారక్‌ను జైలు అధికారులు ఏర్పాటు చేశారు.

Comments

comments