Search
Friday 16 November 2018
  • :
  • :

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ‘భరత్ అనే నేను’ మేకింగ్ వీడియో

mahesh-babu-2
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 1 నిమిషం 53 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మూవీని ఎలాంటి వాతావరణంలో రూపొందించారన్నది తెలుస్తొంది. మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను నిర్మాత డీవీవీ దానయ్యకు చెందిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘భరత్ అనే నేను’ బహిరంగ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో మహేష్ బాబు, సూపర్ స్టార్ క్రిష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ, నటి కియారా అద్వాని, నటుడు ప్రకాష్ రా , తదితరులు హాఙరు కావడంతో సందడిగా ఈవెంట్ ఙరిగింది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, డీవీవీ దానయ్య మూవీని నిర్మించారు.

Comments

comments