Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

భారత్ బంద్ … హింసాత్మకం

BANDH

ఢిల్లీ : ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దళితులు సోమవారం భారత్ బంద్ నిర్వహించారు. ఈ క్రమంలో దేశంలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులతో ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయారు. మొరేనాలో ఇద్దరు, గ్వాలియర్‌లో ఇద్దరు చనిపోయారు. పలు చోట్ల ఆందోళనకారులు వాహనాలను తగలబెట్టారు. పలు చోట్ల ఆందోళన కారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రైళ్లను బస్సులను అడ్డుకున్నారు. మీరట్ జిల్లాలోని శోభాపూర్ పోలీసు ఔట్‌పోస్టుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఆగ్రాలో పోలీసులు, మీడియా సిబ్బందిపై రాళ్ల దాడికి చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. యుపిలోని అలహాబాద్, కాన్పూర్, పథ్రాన్, సహరాణ్‌పూర్ తదితర ప్రాంతాల్లో బంద్‌తో ఉద్రక్తత నెలకొంది. శాంతియుత మార్గంలో నిరసన చేపట్టాలని, ఎస్‌సి, ఎస్‌టి చట్టంపై కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.

Bharat Bandh … Violent incidents in Country

Comments

comments