Search
Wednesday 14 November 2018
  • :
  • :

“భారత్ మాతాకీ జై నినాదం”తో ఏకీభవిస్తున్న: ఫడ్నవీస్

Devendra-Fadnavisముంబయి: మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాసిక్‌లోని ఓ సదస్సులో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ మాతాకీ జై నినాదం’తో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ‘భారత్ మాతాకీ జై’ అనని వాళ్లకు దేశంలో ఉండే హక్కు లేదని ఆయన పేర్కొనడం గమనార్హం. ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసి, ‘భారత్ మాతాకీ జై’ అనాలని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైసి వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని దారుల్ ఉలూమ్ దియోబంద్‌కు చెందిన ఇస్లామిక్ సెమినరీ భారత్ మాతాకీ జై నినాదానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన విషయం శుక్రవారం హల్‌చల్ చేసింది.

Comments

comments