Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

భారతీయులకు మెగసెసే పురస్కారం

భరత్ వాత్వాని, సోనమ్ వాంగ్‌చుక్‌లకు అవార్డు
ఆసియా నుంచి ఆరుగురి ఎంపిక
వచ్చే నెల 31న పిలిప్పీన్స్‌లో ప్రదానం

Bharat Vaswani and Sonam Wangchuk Win Ramon Magsaysay Award

మనీల:ఆసియాలో నోబల్‌బహుమతికి ప్రతిరూపంగాప్రసిద్ధి చెందిన రామన్ మెగసెసే అవార్డు ఈ ఏదాది ఆరుగురికి లభించింది. ఈ ఆరుగురిలో ఇద్దరు భారతీయులున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలలో వచ్చేనెల 31న ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2018 సంవత్సరానికి ఆరుగురు ‘హీరోస్ ఆఫ్ హోప్’ (ఆశావాద కథానాయకులు)ను ఈ పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు రామన్ మెగసెసే అవార్డు ఫౌండూషన్ గురువారం ప్రకటించింది. వీరిలో భారత దేశానికి చెందిన భరత్ వాత్సాని, సోనమ్ వాంగ్‌చుక్‌లు ఉన్నారు. మిగతా నలుగురు కంబోడియాకు చెందిన యౌక్ ఛాంగ్, తూర్పు తైమూర్‌కు చెందిన మారియా డి లార్డెస్ మార్టిన్స్‌క్రుజ్, ఫిలిప్పీన్స్‌కు చెందిన హోవార్డ్ డీ, వియత్నాంకు చెందిన వోథి హోఆంగ్ యెన్ రోమ్‌లు మిగతా నలుగురిలో ఉన్నారు. ఈ పురస్కారం కింద ప్రతి ఒక్కరికి ప్రశంసాపత్రం, పతకం, నగదు బహుమతి అందజేస్తారు. ఆగస్టు 31న మనీలలోని ఫిలిప్పీన్స్ కల్చరల్ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో వీరినందరినీ సత్కరిస్తారు. భారత దేశంలో మానసిక అస్వస్థులకు సేవ చేసినందుకుగాను భరత్ వాత్వానికి ఈ అవార్డు లభించినట్లు అకాడమీ ఒక ప్రకటనలో తెలియజేసింది. వీధుల్లో తిరిగే వేలాదిమంది మానసిక అస్వస్థులకు ఆయన సేవలు అందించారు. ప్రకృతి పరిరక్షణ, సంస్కృతి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేసినందుకుగాను వాంగ్‌చుక్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

Comments

comments