Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

భారత్‌కు మరో గెలుపు

bharat

న్యూఢిల్లీ: నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న ప్ర తిష్టాత్మకమైన చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భార త్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 21 గో ల్స్ తేడాతో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అర్జెంటీనాను ఓడించింది. ప్రారంభం నుంచే భారత్ దూ కుడుగా ఆడింది. అటాకింగ్ గేమ్‌తో అర్జెంటీనా ను ముప్పుతిప్పలు పెట్టింది. వరుస దాడులతో అ ర్జెంటీనా డిఫెన్స్‌ను హడలెత్తించింది. ఇదే క్రమం లో స్టార్ ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు తొలి గోల్‌ను సాధించి పెట్టాడు. 17వ నిమిషం లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసిన హర్మన్‌ప్రీత్ దాన్ని గోల్‌గా మలిచాడు. త ర్వాత భారత్ దాడులను మరింత పెంచింది. మ రోవైపు అర్జెంటీనా కూడా స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా పోరాడింది. కాగా, 28వ నిమిషంలో భారత్‌కు రెండో గోల్ లభించింది. స్టార్ ఆటగాడు మన్‌దీప్ సింగ్ అద్భుత ఫీల్డ్ గోల్‌తో జట్టు ఆధిక్యాన్ని 20కు పెంచాడు. అయితే ప్ర థమార్ధం చివరి నిమిషంలో అర్జెంటీనా తొలి గో ల్ చేసింది. మటియాస్ పరేడ్స్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో సఫలమయ్యాడు. దీంతో భారత్ ఆధిక్యం 21కి తగ్గింది. కాగా, ద్వితీయార్థంలో రెండు జట్లు కూడా గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. చివరి వరకు ఆధిక్యా న్ని కాపాడుకున్న భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌పై 40తో ఘన విజయం సాధించింది.

Comments

comments