Search
Friday 21 September 2018
  • :
  • :

ఆసియా కప్ హాకీ సెమీస్‌లో భారత్

indiaకమిగహర(జపాన్): ఇక్కడ జరుగుతున్న ఆసియాకప్ మహిళా హాకీ టోర్నమెంట్‌లో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 71 గోల్స్ తేడాతో కజకిస్థాన్ జట్టును చిత్తు చేసి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. లీగ్ స్థాయిలో మెరుపులు మెరిపించిన భారత్ నాకౌట్‌లోనూ సత్తా చాటింది. క్వార్టర్ ఫైనల్ పోరులో కజకిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. గుర్జిత్ కౌర్ మూడు గోల్స్ సాధించి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. గుర్జిత్ (4, 42, 56 నిమిషాల్లో) గోల్స్ సాధించింది. మరోవైపు నవనీత్ కౌర్ (22, 27 నిమిషాల్లో) రెండు గోల్స్‌ను నమోదు చేసింది. కాగా దీప్ గ్రేస్ ఎక్కా కూడా రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. ఆట రెండో నిమిషంలోనే కజకిస్థాన్ క్రీడాకారిణి దోమప్రెనివా కళ్లు చెదిరే గోల్ చేసి తన జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. అయితే ఈ ఆనందం వారికి ఎక్కువ నిలువలేదు. రెండు నిమిషాల తర్వాత భారత స్టార్ గుర్తిజ్ కౌర్ గోల్ చేసి స్కోరును సమం చేసింది. 16వ నిమిషంలో దీప్ గ్రేస్ ఎక్కా సాధించిన గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని అందుకుంది. తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడలేదు.

Comments

comments