Search
Saturday 22 September 2018
  • :
  • :

2018లో వృద్ధి వేగవంతం

urjit-patel

గతేడాది దేశీయ ఆర్థిక వ్యవస్థ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది

ఐఎంఎఫ్ కమిటీ సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్

వాషింగ్టన్ : గత ఆర్థిక సంవత్సరం(201718)లో దేశీయ ఆర్థిక వ్యవస్థ విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడిందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వేగవంతమైన వృద్ధిని అంచనా వేస్తున్నామని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. అంతకుముందు ఏడాదిలో 7.1 శాతంతో పోలిస్తే గతేడాది జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి 6.6 శాతానికి మందగించింది. అయితే ద్వితీయార్థంలో పెట్టుబడులు రావడంతో పుంజుకుందని ఆయన అన్నారు. ఇక్కడ ఐఎంఎఫ్ కమిటీ సమావేశంలో పటేల్ పాల్గొని ప్రసంగించారు. 201718 ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగిందని అన్నారు. తయారీరంగం, విక్రయాలు ఊపందుకోవడం, వినియోగ సామర్థ్యం పెరగడం, సేవా రంగంలో బలమైన చర్యలు, భారీగా వ్యవసాయోత్పత్తి ఇవన్నీ వృద్ధికి దోహదం చేశాయని అన్నారు. ఇక 2018-19లో అనేక అంశాలు వృద్ధికి దోహదం చేస్తాయని, పెట్టుబడులు స్థిరంగా కొనసాగుతాయని తెలిపారు. అంతర్జాతీయంగా డిమాండ్ పుంజుకుందని, ఇది ఎగుమతులకు ప్రోత్సాహం అందించి, కొత్త పెట్టుబడులు ఊతం అందిస్తుందని అన్నారు.
7.4 శాతానికి జిడిపి
జిడిపి 7.4 శాతానికి చేరగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016 నవంబర్ నుంచి వినిమయ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మధ్యకాలిక లక్షం 4 శాతం దిగువనే ఉందని ఉర్జిత్ తెలిపారు. కూరగాయల ధరల పెరుగుదల కారణంగా డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.2 శాతానికి చేరిందని.. అయితే తర్వాత వరుసగా దిగివస్తూ మార్చి నెలలో 4.3 శాతానికి చేరిందని ఆయన వివరించారు. రుతుపవనాలు, ఆహార ధరలతో సహా ద్రవ్యోల్బణం దృక్పథంపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయని అన్నారు.

Comments

comments