Search
Wednesday 26 September 2018
  • :
  • :

ద‌ర్శ‌కుడి కుమారుడిపై డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసు!

Bharathiraja's son Manoj detained for drunken driving

చెన్నై: ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీ రాజా ఇప్పటికే పలు వివాదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయ‌న కుమారుడు మ‌నోజ్  డ్రంక్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డ‌టం భారతీ రాజాకు మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది. నూగ‌బాకం పోలీస్ స్టేష‌న్ పరిధిలో శుక్ర‌వారం రాత్రి పోలీసులు నిర్వ‌హించిన డ్రంకెన్ అండ్ డ్రైవ్‌లో మ‌నోజ్ ప‌ట్టుబ‌డ్డాడు. బిఎండ‌బ్ల్యూ కారులో వ‌చ్చిన ఆయనను మద్యం మ‌త్తులో ఉన్న‌ట్టు గుర్తించిన పోలీసులు ప‌రీక్ష‌లు చేయగా తాగినట్లు వచ్చింది. దీంతో మనోజ్‌పై సెక్షన్ 185 కింద కేసు నమోదు చేయడంతో పాటు రూ.2500 జరిమానా విధించారు. అనంతరం కారును స్వాధీనం చేసుకొని సీజ్ చేసి, మనోజ్‌ ను ఇంటికి పంపించారు పోలీసులు. మనోజ్ 1999లో ఆయన తండ్రి దర్శకత్వంలో వచ్చిన తాజ్‌మహల్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.

Comments

comments