Home జాతీయ వార్తలు దేవుడే వచ్చి రక్షిస్తాడు!

దేవుడే వచ్చి రక్షిస్తాడు!

ind

  నమ్మకంతో ఉరి వేసుకున్న భాటియా కుటుంబం

  ఉరి కారణంగానే మృతి  పోస్టుమార్గం నివేదిక వెల్లడి

 క్షుద్ర పూజలు   చేసేవారని స్నేహితుల వెల్లి

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యల మిస్టరీకి సంబంధించి దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుటుంబం అంతా తాంత్రిక పూజలు చేసే వారని, అందులో భాగంగానే వారు ఈ ఘోరానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో పోలీసులకు లభించిన కొన్ని పత్రాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని వారంటున్నారు. అయితే మృతుల బంధువులు మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు. తాము ఉరి వేసుకున్న తక్షణం దేవుడు ప్రత్యక్షమై తమను రక్షిస్తాడన్న బలమైన నమ్మకంతోనే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. కాగితాల్లో రాసి ఉన్న ప్రతి చర్యను ఆ కుటుంబం కచ్చితంగా పాటిస్తూ వచ్చేదని ఒక పోలీసు అధికారి చెప్పారు.‘ తాము ఉరి వేసుకుని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండే క్షణంలో దేవుడు ప్రత్యక్షమై తమను కాపాడుతారని వారు భావించారు.అదే విషయాన్ని వారు ఆ కాగితాల్లో రాసుకున్నారు’ అని కూడా ఆ అధికారి చెప్పారు. ఇరుగుపొరుగు వారు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు.ఆ కుటుంబ సభ్యులు దేవుడ్ని బాగా నమ్ముతారని, రోజుకు మూడు సార్లు పూజలు చేసేవారని కుటుంబానికిసన్నిహిత మిత్రుడైన ప్రవీణ్ మిట్టల్ తెలిపారు. పదేళ్ల క్రితం జరిగిన ఒక ప్రమాదం, ఆ తర్వాతజరిగిన ఒక అద్భుతం ఆ కుటుంబం ఆధ్యాత్మికంగా మారడానికి కారణమయిందని మరో కుటుంబ మిత్రుడు హేమంత్ శర్మ అంటున్నారు. పదేళ్ల క్రితం ప్లైవుడ్ వ్యాపారం చేసే లలిత్ భాటియాపై ఓ కర్ర దుంగ పడడంతో అతను మాట కోల్పోయాడని, కుటుంబం అన్ని మార్గాల్లో ప్రయత్నించినా ఫలితం లేక పోయిందని, దీంతో వారు పూజలు చేయడం మొదలు పెట్టారని ఆయన చెప్పారు. కొంత కాలానికి లలిత్‌కు తిరిగి మాటలు రావడంతో తాము చేసిన పూజల కారణంగానే అతనికి మాట వచ్చిందని వారు బలంగా నమ్మారని, అదే వారు ఆధ్యాత్మికంగా మారడానికి కారణమైందని శర్మ తెలిపారు.

abln
సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల కేసులో చనిపోయిన 11 మందిలో ఎనిమిది మంది పోస్టుమార్టం నివేదికలను బట్టి వారంతా ఉరి వేసుకున్న కారణంగానే చనిపోయారని ఎలాంటి పెనుగులాట జరిగిన గుర్తులు లేవని తేలిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోఆదివారం ఒకే కుటుంబానికి చెందిన11 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. వీరిలో పది మంది సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతూ కనిపించగా, 77 ఏళ్ల నారాయణ్ దేవి అనే వృద్ధురాలు మాత్రం వేరే గదిలో నేలపై చనిపోయి కనిపించింది. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలు, వారి నాయనమ్మ నారాయణ్ దేవి సహా 8 మంది పోస్టుమార్టం పూర్తయిందని, వారి శరీరంపై పెనుగులాట, లేదా గొంతు నులిమి చంపిన గుర్తులేవీ పోలీసులకు కనిపించలేదని ఆ అధికారి చెప్పారు. గొంతు నులమడం వల్లనే నారాయణ్ దేవి చనిపోయి ఉండవచ్చని ఇంతకు ముందు అనుమానించారు కానీ పాక్షిక ఉరి కారణంగానే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారని,ఆ అధికారి చెప్పారు.ఆమె మృత దేహానికి సమీపంలో ఒక తాడు వేలాడుతూ కనిపించిందని కూడా ఆయన చెప్పారు. అయితే ఆమె మెడనుంచి తాడును ఎవరు తీసి ఉంటారనే దానిపైన దర్యాపుత చేప్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ప్రాథమిక దర్యాప్తును బట్టి వారంతా ఇష్టపూర్వకంగా ఉరివేసుకుని చనిపోయినట్లు కనిపిస్తోందని ఆయన చెప్తూ, తుది నివేదిక ఇంకా అందాల్సి ందని చెప్పారు. పోలీసుల తనిఖీల్లో చేతి రాతతో ఉన్న క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని కాగితాలు లభ్యమైనాయి. తాంత్రిక పూజల్లో భాగంగానే వీరంతా ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగితాల్లో రాసి ఉన్నట్లుగానే చనిపోయిన వారందరి చేతులుకట్టి ఉన్నాయని, కళ్లకు గంతలు కూడా ఉన్నాయని వారు అంటున్నారు. అంతే కాకుండా అరవకుండా వారి నోటికి టేటికి కూడా వేసి ఉన్నాయి. తాంత్రిక పూజలతో ప్రభావితమైన కుటుంబ సభ్యుల్లో ఒకరు మిగతా పదిమందిని ఉరి వేసి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారంతా మోక్షాన్ని పొందుతారని కొన్ని కాగితాల్లో రాసి ఉందని కూడా ఆ అధికారి చెప్పారు. కాగా, మృత దేహాలను అంత్యక్రియలకోసం సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. చనిపోయిన వారిని నేలపై పడి ఉన్న నారాయణ్ దేవి, ఆమె కుమార్తె ప్రతిభ(57), ఇద్దరు కుమారులు భవనేష్(50), లలిత్ భాటియా(45)గా గుర్తించారు. భవనేష్ భార్య సవిత(48), వారి ముగ్గురు పిల్లలు మీను(23),నిధి(20), ధ్రువ్(15) కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. లలిత్ భాటియా భార్య టినా(42), వారి కుమారుడు 15 ఏళ్ల శివమ్‌తో పాటు ప్రతిభ కుమార్తె ప్రియాంక(33) కూడా మృతుల్లో ఉన్నారు. గత నెలలోనే ప్రియాంకకు పెళ్లి నిశ్చయం అయిందని, ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగాల్సి ఉందని తెలుస్తోంది.

ఎవరో చంపేసి ఉంటారు
క్షుద్రపూజల కథనాలు అవాస్తవం
-నారాయణ్ దేవి కుమార్తె ఆవేదన
ఢిల్లీలోని బురారి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. వీరంతా క్షుద్రపూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం అత్మహత్యలకు పాల్పడి ఉంటారని పోలీసులతో పాటు వారి సన్నిహితులు కూడా భావిస్తూ ఉండగా, చనిపోయిన వారిలో ఒకరైన నారాయణ్ దేవి కుమార్తె సుజాత మాత్రం అదంతా అబద్ధమని, ఎవరో వారిని చంపేసి ఉంటారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా ఆమె అన్నారు. ‘ఎవరో వారిని చంపేసి ఉంటారు. క్షుద్ర పూజల కోణంలో వస్తున్న కథనాలన్నీ తప్పు. కుటుంబ సభ్యులంతా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమతో, సంతోషంగా ఉండే వారు. వారు చివరికి బాబాలను కూడా నమ్మే వారు కాదు’ అని సుజాత అన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మృతుల ఇంట్లో చేతి రాతలతో కూడిన ఒక నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్‌బుక్ ప్రకారం కుటుంబం క్షుద్రపూజల్లో పాల్గొనేదని, ఆ పత్రాల్లో సూచించిన విధంగానే వారంతా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అంటున్నారు. చివరికి పోస్టుమార్టం నివేదిక సైతం ఆత్మహత్యలు చేసుకోవడం వల్లనే వారంతా చనిపోయారని, పెనుగులాట జరిగినట్లు ఎలాంటి సూచనలు లేవని చెప్తోంది.