Home జాతీయ వార్తలు నిర్లక్ష్యం నిప్పు… ప్రాణాలకు ముప్పు

నిర్లక్ష్యం నిప్పు… ప్రాణాలకు ముప్పు

Bhilai steel plant fire accident

దేశం లోనే అత్యంత పురాతన మైన భిలాయ్ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించి తొమ్మిది మంది దుర్మరణం పాలు కావడం పరిశ్రమల్లో కార్మిక భద్రత ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కోక్‌ఒవెన్‌కు అనుసంధానమయ్యే గ్యాస్‌పైప్ లైన్ పేలిపోవడమే ఈ ప్రమాదానికి దారి తీసింది. గత ఏడాది ఉత్తర ప్రదేశ్ లోని రాయ్‌బరేలీ జిల్లా ఉంచహార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో బాయిలర్ పేలి 32 ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఫ్యాక్టరీల్లో బాయిలర్లు ఉన్నప్పుడు వాటికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే తక్షణం హెచ్చరికలు అందుతాయి. బాయిలర్ల రూపకల్పనలోనే ప్రమాదాలను నివారించే వ్యవస్థ ఇమిడి ఉంటుంది. క్లిష్టసమయంలో బాయిలర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడినప్పుడు ప్రమాదాన్ని వెంటనే నివారించ గల ఆటోమెటిక్ వ్యవస్థ తనకు తానుగా పనిచేస్తుంది. ఇన్ని అవకాశాలున్నా బాయిలర్ పేలుడు జరిగిందంటే భద్రతా ప్రమాణాలు ఏమాత్రం లేవనే చెప్పవచ్చు.

భద్రతా ప్రమాణాల లోపం
నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో అందచేసిన వివరాలను పరిశీలిస్తే పరిశ్రమల్లో బాయిలర్లు,గ్యాస్‌సిలిండర్లు, గ్యాస్‌పైప్ లైన్లు పేలుళ్ల వ్ల 2015లో 61 మరణాలు సంభవించాయని వెల్లడయింది. అంతకు ముందు సంవత్సరం ఈ దుర్ఘటనలు మరీ ఎక్కువని తేలింది. కార్మిక భద్రత, రక్ష ణ, సంక్షేమం, కచ్చితంగా కల్పించ వలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాని దే. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు.అయితే ఇదే ప్రమాదం మళ్లీ మళ్లీ జరిగితే నిర్వహణ యంత్రాంగం వైఫల్యం అని చెప్పక తప్పదు. మూడేళ్ల క్రితం కూకట్‌పల్లి లోని ఒక పరిశ్రమలో పేలు డు వల్ల ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఆ పరిశ్రమలో గతంలో నాలుగు సార్లు ప్రమాదాలు సంభవించి 21 మంది పాణాలు కోల్పోయారు. కాలం చెల్లిన డిటొనేటర్లను నిర్వీర్యం చేసే పరిశ్రమకు చెందిన చిన్న షెడ్డులో 15 మంది వరకు పనిచేస్తుండగా డిటొనేటర్ పేలింది. సిబ్బందికి భద్రతా పరికరాలు సమకూర్చకపోవడమే ఈ దుర్ఠటపకు దారితీసిందన్న ఆరోపణలున్నాయి. జంటనగరాలు, శివారు ప్రాంతా ల్లో పదికి పైగా పేలుడు పదార్ధాలను తయారు చేసే పరిశ్రమలు ఉన్నా యి. పాతబస్తీ లోని కంచన్‌బాగ్ లోని పరిశ్రమల్లో అనేక సార్లు పేలుళ్లు జరిగాయి. ఇటువంటి దుర్ఘటనలు ఎన్ని జరిగినా భద్రతా ప్రమాణాల లోపం మాత్రం వెంటాడుతున్న పరిస్థితి కొనసాగుతోంది.

తూతూ మంత్రంగా తనిఖీలు
దేశంలో పరిశ్రమలు తమపని తాము సులువుగా చేసుకునే దానికి ప్రతిబంధకంగా పారిశ్రామిక విధానం తయారైంది. అసమర్ధత,లంచగొండితనం, పెచ్చుపెరిగి తనిఖీలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. కనీస సౌకర్యాలకు సంబంధించి స్వయం ధ్రువీకరణ, వేరే వ్యవస్థ ధ్రువీకరణ ఇవన్నీ విధానపరమైనవే అయినప్పటికీ ఆచరణలో శూన్యం అవుతున్నాయి. పరిశోధన విభాగం