Home తాజా వార్తలు భీమ్ యాప్‌తో ఆధార్ అనుసంధానం

భీమ్ యాప్‌తో ఆధార్ అనుసంధానం

Ravi-Shankar-Prasad

ఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన భీమ్ యాప్‌ను ఆధార్‌కు అనుసంధానిస్తున్నట్లు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్  తెలిపారు. ఇప్పటి వరకు 4.47 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌కు అనుసంధానం చేశామని ఆయన పేర్కొన్నారు. నెల రోజుల్లో మరో రెండు కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌కు అనుసంధానిస్తామన్నారు. ఇప్పటి వరకు ఆధార్ ద్వారా రూ.167.3 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. దేశంలో 111కోట్ల మంది ఆధార్ నమోదు చేసుకున్నారని తెలిపారు. ఆధార్‌తో వివిధ ప్రభుత్వ పథకాలకు చెందిన రూ. 36వేల కోట్లు ఆదా అయ్యాయని ఆయన చెప్పారు.