Search
Wednesday 26 September 2018
  • :
  • :

ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ కూతురు ప్రసవం

Collector-Murali

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం జిల్లా కలెక్టర్ మురళి కుమార్తె పండంటి ఆడబిడ్డను జన్మనిచ్చింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కలెక్టర్ తన కూతురును ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించారు. ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కోసం ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.

ఇక కలెక్టర్ మురళి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలు జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కూతురును ములుగు ఆరోగ్య కేంద్రంలో చేర్పించి వైద్యుల పర్యవేక్షణలో ప్రసవం చేయించారు. మొదటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగేలా దృష్టిపెట్టిన కలెక్టర్ మురళి, తన కుమార్తెను సైతం ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ఆదర్శంగా నిలిచారు.

కలెక్టర్ కూతురు ప్రగతి, అల్లుడు ప్రదీప్ హైదరాబాద్‌లో ఉంటున్నారు. కాగా, ప్రగతికి సాధారణ ప్రసవం సాధ్యంకాకపోవడంతో లావణ్య, సుగుణ, స్నిగ్ధ, లలితాదేవి వైద్యుల బృందం శస్త్రచికిత్స చేయగా ఆడశిశువు జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో కలెక్టర్ మురళి సంతోషం వ్యక్తంచేశారు.

Comments

comments