Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

బీటెక్ విద్యార్థిని బలవన్మరణం..!

Married Woman Commits Suicide: Prakasam district

అమరావతి: బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఎపిలోని అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. ప్రియాంక అనే యువతి మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతుంది. అయితే, గత కొంతకాలంగా ఆమెను సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారు. వాళ్ల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ల వేధింపుల గురించి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుందని సమాచారం. సోమవారం కళాశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కొందరు ఆమెను బస్సులో బెదిరించారట. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రియాంక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments