Home నల్లగొండ బీబీనగర్ నిమ్స్ నిర్మాణం ఓ ఫ్రాడ్ : హోంమంత్రి నాయిని

బీబీనగర్ నిమ్స్ నిర్మాణం ఓ ఫ్రాడ్ : హోంమంత్రి నాయిని

NAYINIమన తెలంగాణ/ హైదరాబాద్: బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి నిర్మాణంలో ఫ్రాడ్ జరిగిందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. బడ్జెట్‌పై చర్చలో ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ నగరం నాలుగు పక్కలా ప్రభుత్వం ఆసుపత్రులు నిర్మిస్తుందని చెప్పగా, కాంగ్రెస్ ఎంఎల్‌సి రాజ్‌గోపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తపరిచారు. కొత్తగా ఆసుపత్రులు కట్టడాన్ని స్వాగతిస్తూనే, భవనాలు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్న బీబీనగర్ నిమ్స్‌ను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కొత్తవి కట్టడానికి సమయం పడుతుందని, సిద్ధంగా ఉన్న దాన్ని తొలుత ప్రారంభించాలని సూచించారు. హోంమంత్రి నాయిని మద్యలో ఇటీవలే ఒపి ప్రారంభించామని, గతంలో మీరేం చేశారని, ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. మళ్లీ రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణం చేసినందునే, మీరు ఒపి ప్రారంభించారని అన్నారు.
దీంతో ఎందుకు అక్కడ కట్టారో, ఎందుకు పెండింగ్‌లో మాకు తెలుసు, అక్కడ ఫ్రాడ్ జరిగిందని హోంమంత్రి ఆరోపించారు. సభ పక్కదోవ పడుతుండగా చైర్మన్ స్వామిగౌడ్ కల్పించుకుని బడ్జెట్‌పైనే మాట్లాడాలని చెప్పారు.