Home తాజా వార్తలు సైకిల్ పై…. స్ట్రీట్ పెట్రోలింగ్

సైకిల్ పై…. స్ట్రీట్ పెట్రోలింగ్

cyc

పంజాగుట్ట: దేశంలోనే మెట్టమొదటి సారిగా రాష్ట్రంలోని పంజాగుట్ట మోడల్ పోలీస్‌స్టేషన్‌లో సైకిల్  స్ట్రీట్ పెట్రోలింగ్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మారుమూల ప్రాంతాల్లోకి పెట్రోలింగ్ సదుపాయాన్ని కల్పించడంతో పాటు సామాన్య ప్రజలకు పోలీస్ విజిబులిటి పరిధిని పెంచేందుకు ఈ విధానం దోహదం చేస్తుందని చెప్పారు. నగర పోలీస్ కమీషనర్ ఆమోదం మేరకు ఈ విధానాన్నిమొదటి సారిగా పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఆమలు చేస్తున్నట్టమని తెలిపారు. మొదట నాలుగు సైకిళ్ల ద్వారా ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో అవసరాన్నిబట్టి వాహనాల సంఖ్యను పెంచుతామని ఆయన పేర్కొన్నారు.

వాహనాల ప్రత్యేకతలు… ఈ సైకిళ్ల కు జిపిఎస్ విధానాన్నిఅనువదించడంతో పాటు, సైకిల్ వెనుక భాగంలో ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రథమ చికిత్స పరికరం, వాటర్ బాటీల్, కమ్యూనికేషన్ కోసం అవసరమైన వైర్‌లెస్ సెట్ వంటి అనేక వసతులను ఈ వాహనాలకు కల్పించినట్టు తెలిపారు. ఈ వాహనాల ద్వారా బస్తీలలో ఉన్న ఇరుకైన గల్లీల్లో కూడా పోలీస్ పెట్రోలింగ్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇప్పటి వరకు విశాల మైన రోడ్లలోనే జీపులు, బైక్‌ల వంటి వాహనాల ద్వారా పెట్రోలింగ్ చేసేవారమని అన్నారు. ప్రస్తుత సైకిల్ పెట్రోలింగ్ ద్వారా గతంలో ఎదరౌతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ విధానం దోహదపడుతుందని తెలియజేశారు. ఈ విధానం ద్వారా నేరాలను అరికట్టడం మరింత సులభం అవుతుందన్నారు.