Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సైకిల్ దొంగతనంతో  కెరీర్ మొదలు..

Muhammed-Ali-Career-In-Pict1942 జనవరి 17న ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కాషియన్ క్లే అలియస్ మహమ్మద్ అలీ బాక్సింగ్ కెరీర్ ఆశ్చర్యకరంగా మొదలైంది. జన్మదినం పురస్కరించుకొని తన తల్లిదండ్రులు తనకు కొనిచ్చిన సైకిల్‌ను ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. దీంతో తన సైకిల్ పోయిన విషయంపై పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కాషియన్ క్లే.. జో మార్టిన్ అనే పొలీస్‌తో నేనే దొంగ పట్టుకొని ఎముకలు విరుగొడతానని శపథం చేశాడు. అయితే స్వతహాగా బాక్సరైన జో మార్టిన్ దొంగ ఎముకులు విరగొట్టాలంటే నీవు ముందు బాక్సింగ్ నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. అలా మార్టిన్ శిక్షణలోనే బాక్సింగ్ కెరీర్‌ను మొదలుపెట్టిన కాషియన్ క్లే అమెచ్యూర్ బాక్సింగ్‌లో లెక్కలేనని టైటిళ్లు సాధించాడు.

Comments

comments