Home వనపర్తి స్వచ్ఛభారత్‌పై సైకిల్ యాత్ర

స్వచ్ఛభారత్‌పై సైకిల్ యాత్ర

lady-collector

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం మరుగు దొడ్డి నిర్మించుకొనేలా చేసి మన గ్రామాలను మనమే బాగు చేసుకుందామని కలెక్టర్ శ్వేతా మహంతి  పిలుపునిచ్చారు. బుధ వారం ఆమె వనపర్తి  మండలం అచ్యుతాపురం గ్రామంలో స్వచ్ఛశక్తి వారోత్సవాల్లో భాగంగా స్వచ్చభారత్‌పై అవగాహనకు ఉద్దేశించి విద్యార్థుల సైకిల్‌యాత్రను, డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ జీ చెప్పినట్లు మార్పు అనేది మన నుండే ప్రారంభం కావాలన్నారు. స్వచ్ఛసైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లి గ్రామ విజిలెన్స్ కమిటీలను పటిష్టం చేయడం, ఉదయం 4.30  గంటలకు కమిటి సభ్యులతో బహిరంగ మలమూత్ర విసర్జన ప్రదేశాలకు వెళ్లడాన్ని ఆపివేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. మేస్త్రీల సహకారంతో మరుగుదొడ్లను నిర్మించి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. 15 మంది బాలురు సైకిల్ యాత్రలో పాల్గొంటారు.  ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ద్వారా ఏం చేయాలను కుంటు న్నారని విద్యార్థులను ప్రశ్నించారు. గ్రామాల్లోని ప్రజలను స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పించి ప్రజలందరు  మరుగుదొడ్లు నిర్మించుకునేలా చైతన్యం చేయాలని పేర్కొన్నారు. డిఆర్‌డిఒ గణేష్, ఎస్‌బిఎం ప్రేరక్ భరత్, ఎంపిపి శంకర్‌నాయక్, జడ్పిటిసి వెంకటయ్య,ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి సదాశి వయ్య, సర్పంచ్ ప్రభావతమ్మ ,తదితరులు పాల్గొన్నారు.