Home వార్తలు ‘రోబో’ విలన్‌గా అమితాబ్‌ను అనుకున్నారట!

‘రోబో’ విలన్‌గా అమితాబ్‌ను అనుకున్నారట!

bigbబిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘రోబో’ సినిమాకు ముందుగా చాలామంది కథానాయకుల పేర్లను పరిశీలించినా చివరికి రజనీకాంత్ హీరోగా ఫైనల్ అయి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.  కానీ సినిమాలో విలన్ పాత్రకు కూడా డైరెక్టర్ శంకర్ వేరే నటుడిని అనుకున్నాడట. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్‌బచ్చన్ అని… ఆ పాత్ర చేయడానికి ఆయన ఓకే కూడా చెప్పాడని తెలిసింది. తాజాగా ‘రోబో’ డైరెక్టర్ శంకర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ముందు కమల్‌హాసన్‌ను హీరోగా అనుకొని ఆ తర్వాత షారుఖ్ దగ్గరకి వెళ్లి కథ విషయంలో ఇద్దరికీ తేడా రావడంతో చివరికి రజనీకాంత్‌ను హీరోగా ఫిక్స్ చేసుకున్నాడు శంకర్. అయితే షారుఖ్‌తో ‘రోబో’ తీయాలనుకున్నప్పుడు విలన్‌గా అమితాబ్‌బచ్చనే అని ఫిక్సయి పోయాడట శంకర్. షారుఖ్‌తో కాదు అనుకున్నాక కూడా అమితాబే… శంకర్ మనసులో ఉన్నాడట. అమితాబ్‌కు కథ కూడా చెప్పి ఆయనతో ఓకే చేయించుకున్న శంకర్… డేట్ల కోసం తర్వాత సంప్రదిస్తానని చెప్పి వచ్చేశాడట. అయితే రజనీకాంత్‌కు అమితాబ్‌ను విలన్‌గా పెట్టడం కరెక్ట్ కాదని పైగా రజనీ కూడా ఇందులో నెగటివ్ పాత్ర చేస్తున్నాడు కాబట్టి అమితాబ్ విలన్ పాత్రలో కనిపిస్తే బాగుండదని చివరికి మనసు మార్చుకున్నాడట. దీంతో బిగ్-బికి ఫోన్ చేసి సారీ కూడా చెప్పాడట. ఆతర్వాత సత్యరాజ్-జెడి చక్రవర్తిలాంటి వాళ్లను అనుకొని చివరకు బాలీవుడ్ విలన్ డానీ జాంగ్‌పాను ఖరారు చేశాడు శంకర్. హీరోయిన్‌గా కూడా దీపికాపదుకునే, శ్రియ, నయనతార… ఇలా ఒక్కో పేరు పరిశీలించి చివరికి ఐశ్వర్యను ఓకే చేశాడు ఈ స్టార్ డైరెక్టర్.