Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

‘బిగ్ బాస్’ ఓ సవాలు

NTR

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా స్టార్ మా టీవీలో ప్రసారం కానున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించనుండటంతో అందరిలో ఈ రియాలిటీ షోపై ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ షో ఈనెల 16 నుండి ప్రసారం కానుంది. ఈ షోలో భాగంగా ఓ పెద్ద ఇంట్లో 12 మంది సెలబ్రిటీలు ఉంటారు. వారి ప్రతి కదలికలను 60 కెమెరాలతో గమనిస్తుంటారు. ఇక హైదరాబాద్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో ఎన్టీఆర్, స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కలిసి బిగ్ బాస్ స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అలోక్ జైన్ మాట్లాడుతూ “ఎన్టీఆర్ మా రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు మార్కె ట్‌లో బిగ్గెస్ట్ షోగా ‘బిగ్ బాస్’ ఈనెల 16న రాత్రి 9 గంటల నుండి ప్రసారం కానుంది. ప్రపంచంలోని 40 దేశాల్లో ఈ షో పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు ఇది తెలుగులో ప్రసారం కానుంది. 80 డిఫరెంట్ షోలు మన ఇండియాలో ఉన్నాయి. అందులో 20 ప్రస్తుతం మంచి ట్రెండ్‌లో ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకంటే బిగ్ బాస్ షో ఎంతో ప్రత్యేకమైంది. తెలుగులో ఈ బిగ్ బాస్ షోను 71 ఎపిసోడ్‌లుగా ప్లాన్ చేస్తున్నాం”అని అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ “నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ షోకు నన్ను వ్యాఖ్యాతగా వ్యవహరించమని స్టార్ మా నన్ను అడగడంతో వెంటనే ఓకే చెప్పేశాను. బిగ్ బాస్ షోను హోస్ట్ చేయడం సవాలుగా భావిస్తున్నాను. నాతో పాటు ఇండియాలో చాలా మందికి బిగ్ బాస్ అనేది అమేజింగ్ రియాలిటీ షో అనే నమ్మకముంది. ఈనెల 16 నుంచి సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ షో ప్రసారమవుతుంది. శని, ఆదివారం మాత్రమే హోస్ట్ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. ఓ నటుడిగా ఈ షోకు హోస్ట్‌గా చేయడం మంచి అనుభవాన్నిస్తుంది. ఖచ్చితంగా హిందీలో సక్సెస్ అయినట్లే తెలుగులో కూడా బిగ్ బాస్ షో సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విన్సెంట్, జెస్సి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments